గుండెపోటు బాత్రూం లోనే ఎందుకు ఎక్కువగా వస్తుందో తెలుసా…?

గుండెపోటు బాత్రూం లోనే ఎందుకు ఎక్కువగా వస్తుందో తెలుసా…?

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి. అయితే ఎక్కువ మంది ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు లో గుండె పోటు కూడా ఒకటి. ఆ వయసు, ఈ వయసు అని లేకుండా అన్ని వయసుల వారు గుండె సమస్య తో బాధ పడుతున్నారు.

Video Advertisement

యువకులలో కూడా ఎక్కువగా గుండె పోటు రావడం బాధాకరం. చిన్న వయసులోనే చాలా మంది గుండె పోటు తో మరణించడం దారుణం. అయితే ఎక్కువగా గుండెపోటు అర్ధరాత్రి వేళ ఎందుకు వస్తుంది..?

ఈ విషయం గురించి చూస్తే… అర్ధరాత్రి వేళ గుండెపోటు చాలా మందిలో వస్తోంది. అయితే గుండెపోటు రావడానికి ముందు మూత్రానికి వెళ్లడమో విరోచనం అవ్వటం ఏదో ఒకటి జరుగుతోంది. నిజానికి ఇది ప్రమాదానికి సూచన అన్నట్లుగా మారిపోయింది. ఎక్కువగా బాత్రూం లోనే గుండెపోటు వస్తోంది. ఎక్కువగా బాత్రూం లోనే ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది.

గుండెపోటు రావడానికి ముందు ఎడమ భుజం, మెడ వెనుక భాగం, ఛాతి, కండరాలలో నొప్పి ఎక్కువగా రావడం జరుగుతోంది. చాలా మంది ఇలాంటి లక్షణాలు కనబడితే ఎసిడిటీ ఏమో అని లైట్ తీసుకుంటున్నారు. రోగి తో పాటుగా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా దీని మీద అవగాహన అవసరం.

ఇక బాత్రూం లో ఎక్కువ గుండెపోటు రావడానికి కారణం ఏమిటి అనేది చూస్తే… చాలామంది స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు ని డైరెక్ట్ గా ఒంటి మీద పోసుకుంటారు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ వేగవంతమైన గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ కారణంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు కొంచెం నీళ్ళు కాళ్ళమీద పోసుకుని ఆ తర్వాత స్నానం చేయాలి. అదేవిధంగా లేచిన వెంటనే బాత్రూం లోకి వెళ్లకుండా కాస్త సమయం ఆగి ఆ తర్వాత వెళ్ళాలి. అలా చేయడం వల్ల గుండె మీద మరియు రక్తప్రసరణ మీద కంట్రోల్ వస్తుంది.


End of Article

You may also like