Ads
తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతరని ఎంత వైభవంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో గ్రామాల నుండి ఎంతో మంది భక్తులు సమ్మక్క-సారలమ్మని చూసి తరించడానికి వస్తూ ఉంటారు.
Video Advertisement
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన జాతరగా ఈ మేడారం జాతర అని చెబుతారు. సమ్మక్క-సారక్క మీద ఎంతో మంది భక్తులకి నమ్మకం ఎక్కువ. తమ బాధలు చెప్పి, కానుకలు సమర్పించడానికి మేడారంకి వెళ్తారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఈ జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తేదీన మాఘశుద్ధ పంచమి నాడు మండ మెలగడం, గుడి శుద్దీకరణ కార్యక్రమాలు చేపడతారు అని పూజారులు చెప్పారు. ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ, పడిగిద్ద రాజులు, గోవిందరాజులుని గద్దె మీదకి తీసుకొస్తారు. ఫిబ్రవరి 22 వ తేదీన సమ్మక్క దేవతని గద్దె మీద తీసుకొస్తారు.
ఇంక ఫిబ్రవరి 23వ తేదీన శుక్రవారం రోజు సమ్మక్క-సారక్క దేవతలకి, శ్రీ గోవిందరాజులు, శ్రీ పడిగిద్ద రాజులు దేవుళ్ళకి భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 24వ తేదీన రోజు సమ్మక్క-సారక్క దేవతలు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పడిగిద్ద రాజులు దేవుళ్ళు వన ప్రవేశం చేస్తారు. ఇంక ఫిబ్రవరి 28వ తేదీన తిరుగు వారం పండుగ నిర్వహిస్తారు. సమ్మక్క-సారక్క జాతర ముగుస్తుంది. అయితే సమ్మక్క-సారలమ్మ జాతరలో అమ్మవారు గద్దె మీదకి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న భక్తులు కోళ్ళని ఎగరేస్తారు. అయితే ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసా?
ఇలా ఎందుకు చేస్తారంటే, అమ్మవారు ఉగ్రరూపంలో గద్దె మీదకి చేరుకునే ముందు అమ్మవారిని శాంతింప చేసేందుకు తమ మొక్కులను అమ్మవార్లకు చూపెడుతూ భక్తులు ఇలా చేస్తారు. అందుకే ఇలా కోళ్ళని ఎగరవేస్తారు. అమ్మవారికి ఎంతో మంది ఎన్నో రకాల మొక్కులు మొక్కుతూ ఉంటారు. తమ కుటుంబ సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం అమ్మవారిని దర్శించుకొని వారి దీవెనలు పొందుతారు. మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతరని ఎంతో వైభవంగా జరుపుతారు. అందుకే ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర అని అంటారు.
End of Article