Ads
మనం తేనెని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఆరోగ్యానికి, అందానికి తేనే చాలా బాగా ఉపయోగ పడుతుంది. అలానే అభిషేకాల్లో వాటిల్లో కూడా తేనెని వాడతారు. అయితే నిజానికి నాణ్యమైన తేనే ఎంత కాలమైనా సరే నిల్వ ఉంటుంది. అది అస్సలు ఎంత కాలము వున్న సరే పాడవదు.
Video Advertisement
ఎప్పుడైనా ఎందుకు తేనే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది..?, ఎందుకు అది పాడవదు..? అన్న సందేహం మీలో కలిగిందా..? మరి దీని వెనుక ఉండే కారణం ఏమిటో ఇప్పుడే చూసేద్దాం. స్వచ్ఛమైన తేనె ఎన్ని సంవత్సరాలు అయినా సరే పాడైపోకుండా అలానే ఉంటుంది.
అయితే తేనే అనేది తేనెటీగలు పువ్వుల రసాన్ని పీల్చి సేకరిస్తాయి ఇందులో కొంచెం నీటితో పాటుగా చక్కెర ,ప్రొటీన్లు ఇతర రసాయనాలు ఉంటాయి. తేనెటీగ పువ్వుల నుండి ఈ రసాన్ని దాని యొక్క శరీరంలో నిలుపుకుంటుంది. ఆ తర్వాత శరీరంలో ఉన్న ఒక గ్రంధి నుండి ఎంజైమ్ విడుదలై రక్తంలో కలుస్తాయి.
ఇలా అది తేనె కింద మారుతుంది. ఎంజైమ్స్ తో ఈ పూల తాలూకా రసం కలిసిన తర్వాత గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ గా మారడం జరుగుతుంది. దీనిలో బ్యాక్టీరియా చేరినప్పుడు సహజంగా తేనే నీటి మొత్తాన్ని పీల్చుకుంటుంది. దీని కారణంగా తేనే పాడైపోదు. బ్యాక్టీరియా అయితే చనిపోతుంది.
ఇదిలా ఉంటే గ్లూకోజ్ ఆక్సిడేస్ అనే ఒక ఎంజాయ్ తేనెటీగల శరీరం నుంచి బయటకు వస్తుంది. ఈ ఎంజైమ్ తేనెలో బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడంలో ఉపయోగపడుతుంది. తేనెటీగల జాతి, అది సేకరించిన పూలను బట్టి తేనె యొక్క నాణ్యత అనేది ఉంటుంది. తేనెలో 80 శాతం వరకు చక్కెర ఉంటుంది. అలాగే 18 శాతం నీళ్లు ఉంటాయి అందుకే ఇది ఎన్ని సంవత్సరాలైనా పాడై పోదు. అలానే ఉంటుంది.
End of Article