Ads
సాధారణంగా మనం హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లను చూస్తుంటాం. అయితే కేవలం తెల్లని రంగు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..? మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా..? నిజానికి తెలుపు రంగు తొందరగా మాసిపోతుంది. దానికి త్వరగా మురికి అంటుతుంది. అయినా, హోటల్స్, లాడ్జి వంటి రూమ్స్ లో వైట్ కలర్ బెడ్ షీట్స్ నే ఎందుకు వాడతారు..?
Video Advertisement
ఒకసారి మురికి అంటితే ఈ బెడ్ షీట్స్ ని ఉతకడం కూడా కష్టమే. అయినా.. హోటల్ యజమానులు తెలుపు రంగునే ఉపయోగించడానికి ఎందుకు ఇష్టపడతారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
#1. తెలుపు రంగు పర్యావరణాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది: బెడ్‌షీట్‌లను మార్చడం వల్ల గది మొత్తం ప్రకాశవంతంగా మారుతుంది. డిజైన్‌లు మరియు నమూనాలు ఇతర రంగుల కంటే తెలుపు రంగు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
#2. హోటళ్లు తమ శుభ్రత ప్రమాణాలను నిరూపించుకోవడానికి తెల్లటి బెడ్‌షీట్‌లను ఎంచుకుంటాయి. సాధారణంగా ధనవంతులు ఎక్కువగా వైట్ దుస్తులను ధరిస్తూ ఉంటారు. వారు వాటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే.. మా హోటల్ కూడా పరిశుభ్రంగా ఉంటుందని పరోక్షంగా చెప్పడం కోసమే వైట్ బెడ్ షీట్స్ ని ఉపయోగిస్తారు.
#3. మరొక విషయం ఏంటంటే.. రంగు మనస్తత్వశాస్త్రం ప్రకారం, తెలుపు స్వచ్ఛత మరియు పరిపూర్ణతను సూచిస్తుంది. ఎరుపు లేదా నీలం బెడ్ షీట్ ఉందనుకోండి. అది మురికి అంటినా కనిపించదు. అది శుభ్రంగా ఉందని మనం చెప్పలేం. కానీ, వైట్ బెడ్ షీట్ విషయంలో మాత్రం మనం కచ్చితంగా అది శుభ్రంగా ఉంది అని చూడగానే చెప్పేస్తాం.
#4. ఈ బెడ్ షీట్లను రోజూ ఉతకాల్సి ఉంటుంది. కనుక ఇది ఏదైనా ఇతర రంగులో ఉంటే, అది త్వరలోనే వాడిపోతుంది. తెలుపు రంగుతో అలాంటి సమస్య లేదు. తువ్వాలు కూడా తెల్లగా ఉండడానికి కారణం అదే.
#5. మరో కారణం ఏంటంటే.. తెలుపు రంగును సులభంగా బ్లీచ్ చేయవచ్చు. అలాగే, హోటల్ సిబ్బంది వాషింగ్ చేసినప్పుడు, వారు ఏ రంగులు దుస్తులు వాషింగ్ మెషిన్ లో ఉన్నాయి అన్న విషయమై చింతించకుండా అదే వాషింగ్ మెషీన్‌లో బెడ్ లినెన్‌లు, టవల్స్ మరియు ఏదైనా ఇతర మురికి బట్టలు వేసేయవచ్చు.
End of Article