భర్త వయసు భార్య వయసు కంటే కొన్ని సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కడైనా చూసే విషయమే ఇది. కానీ అందరం అది ఆచారం ఏమో, అలాగే ఉండాలేమో అనుకుంటాం. కానీ దీని వెనకాల కొన్ని సైకాలజీ కి సంబంధించిన కారణాలు ఉన్నాయి. అవేంటంటే

representative image

భార్య భర్త కంటే చిన్నది కాబట్టి వృద్ధాప్య దశ ను ముందు చేరుకునేది భర్తే. ఇద్దరూ ఒకటే వయసులో ఉంటే వృద్ధులు అయిన తర్వాత, ఇద్దరికీ వేరే వాళ్ళ సహాయం, ఆసరా కావాల్సిన అవసరం వస్తుంది. అదే భార్య వయసు తక్కువ ఉంటే భర్తకు ఏ అవసరం వచ్చినా జాగ్రత్తగా చూసుకునే వీలు ఉంటుంది.

సర్వే ప్రకారం 20 శాతం గొడవలు అహం వల్లే అవుతున్నాయి. ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు అయితే ఇద్దరికీ దాదాపు ఒకటే రకమైన ఆలోచనల తో పాటు, అహం కూడా ఒకే లాగా ఉంటాయి. అంటే ఇద్దరికీ తను చెప్తే నేను వినడం ఏంటి అన్న భావన కలుగుతుంది. అదే ఇద్దరికీ వయసు తేడా ఉంటే పరిణితి లో కూడా తేడా ఉంటుంది.

ఇంకొక కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ (హార్మోన్ల అసమతుల్యత). 2 నుండి 7 ఏళ్ల కంటే ఎక్కువ తేడా ఉన్నా కూడా ప్రమాదమే నట. ఆడవాళ్ళకి 30 ఏళ్లు, మగవాళ్ళకి 35 ఏళ్ళ సమయంలో హార్మోన్ల లెవెల్ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ వయసు తేడా ఉండాలి అని సైకాలజీ చెప్తుంది.

మహిళలు మగవాళ్ల కంటే కొంచెం ముందు అంటే అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు. తెలివితేటలు ఆలోచనా విధానాలు తమ వయసు లో ఉండాల్సిన దాని కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆలోచనా విధానానికి తగ్గట్టు వయస్సు భేదము ఉండేలా చూసుకుంటారు.

సైకలాజికల్ సర్వే ప్రకారం ఆడవాళ్లు మానసికంగా మగ వాళ్ళ కంటే కొంచెం దృఢంగా ఉంటారు. అంటే ఆడవాళ్ళకి మగవాళ్లతో పోలిస్తే మానసిక బలం ఎక్కువ. భర్త చనిపోతే భార్యలు తట్టుకోగలదు కానీ భార్య చనిపోతే భర్త తట్టుకోలేడు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య యత్నం చేసే, లేదా తమని తామే హర్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పుడు అర్థమైందా ఈ వయసు తేడా వెనకాల ఉన్న రహస్యం.

Follow Us on FB:


Sharing is Caring: