జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కిరాక్ ఆర్పీ ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. అనంతరం మల్లెమాల వారితో ఉన్న మనస్పర్ధల వల్ల జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వచ్చారు. ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ పై పలు రకాల విమర్శలు కూడా గుప్పించి వార్తల్లో నిలిచారు ఆర్పీ. జబర్దస్త్ కమెడియన్లలో చాలా మంది ఆర్పీ మాటలను కూడా తప్పు పట్టారు. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టలేదు ఆర్పీ.

Video Advertisement

 

 

ఆ తర్వాత ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక రెస్టారెంట్ మొదలుపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. ఆర్ పీ రెస్టారెంట్ ను ఓపెన్ చేయడం ఏంటి అని కొంతమంది నెగటివ్ గా కామెంట్స్ కూడా చేసారు. కట్టెల పొయ్యి పై చేపల పులుసు వండే ఆ రెస్టారెంట్ లో రోజుకు రూ.2 లక్షల రూపాయల బిజినెస్ కూడా జరుగుతుందని సమాచారం. దీంతో ఆయన పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చిందని తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లు ఈ రెస్టారెంట్ కు ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ చేయడం ఈ రెస్టారెంట్ పాలిట వరమైంది.

why kirak RP closed his restaurent..!!

అయితే తక్కువ స్థలంలో రెస్టారెంట్ ను ఓపెన్ చేయడం కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ రెస్టారెంట్ నిర్వహణ విషయంలో ఆర్పీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొన్ని మార్పులతో త్వరలో రెస్టారెంట్ ను మళ్లీ ఓపెన్ చేయాలని ఆర్పీ భావిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా కిచెన్ యొక్క సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు షాప్ కు కీలక మార్పులు చేసి మళ్ళీ రెస్టారెంట్ ఓపెన్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

why kirak RP closed his restaurent..!!

ప్రస్తుతం జనాల తాకిడి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వర్కర్లు, వంట మాస్టర్లను పెంచాల్సిన అవసరం ఉందని ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి కొద్ది రోజులు తాత్కాలికంగా రెస్టారెంట్ ను ఆపాము అని ఆర్పీ తెలిపారు. ప్రస్తుతం అనుభవం ఉన్న వంట మాస్టర్లను హైదరాబాద్ తీసుకు వెళ్లడం కోసం ఆయన నెల్లూరు వచ్చి వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో ఆర్పీ రెస్టారెంట్ మళ్ళీ ఎప్పుడు తిరిగి అందుబాటులోకి వస్తుందో చూడాలి..