అయ్యప్ప స్వామి మోకాళ్ళకి ఈ బంధనం ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక కథ ఏంటంటే..?

అయ్యప్ప స్వామి మోకాళ్ళకి ఈ బంధనం ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక కథ ఏంటంటే..?

by Megha Varna

Ads

అయ్యప్ప స్వామి వారి భక్తులు అయ్యప్ప మాల వేసుకుని ఎంతో నిష్టతో పూజలు చేస్తారు. 40 రోజుల పాటు కఠోర దీక్షతో నియమాలను పాటిస్తూ కొలుస్తారు. ఆ తర్వాత శబరిమల వెళ్లి మాలని తొలగిస్తారు.

Video Advertisement

ఎప్పుడైనా గమనించినట్లయితే అయ్యప్పస్వామి కాళ్ళకి పట్టి ఉంటుంది. అయితే అసలు ఆ పట్టీ ఎందుకు వచ్చింది..?, ఎందుకు ధరిస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యప్పస్వామి పందల రాజు వద్ద పన్నెండేళ్ళు పెరుగుతారు. ఆ తర్వాత తాను హరిహరసుతుడని తెలుసుకుంటారు.

ayyappa

ధర్మం సాధించడం కోసం ఆయన జన్మించారని నారదమహర్షి ద్వారా గ్రహిస్తారు. ఆ తర్వాత మహిషిని అయ్యప్పస్వామి వహిస్తారు. అది అయ్యాక శబరిమల ఆలయంలో జ్ఞానపీఠంపై స్వామివారి కూర్చుంటారు. అయితే అయ్యప్ప స్వామి వారు 18 మెట్ల పైన జ్ఞానపీఠంపై కూర్చుని ఉన్నప్పుడు పందల రాజు ఆయన కోసం వస్తారు.

DIVINE GOOD NEWS! Sabarimala Lord Ayyappa devotees alert! Now, get Swamy Prasadam at your doorstep - Here is how | Zee Business

18 మెట్లు ఎక్కి ఆయనని చేరుకునే క్రమంలో అయ్యప్పస్వామి లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో పట్టుతప్పి పడిపోతారు. అది చూసిన పందల రాజు ఆయన కాళ్ళకి పట్టు పట్టిని కడతారు. అనంతరం స్వామి పడిపోకుండా ఉంటారు. ఆ తర్వాత పందల రాజు అదే పట్టీతో ఎప్పటికీ ఉండాలని కోరగా.. దానికి అయ్యప్ప స్వామి అంగీకరించి పందల రాజుకి ఒక వరం ఇస్తారు ఇలా ఇప్పటికి కూడా ఆలయంలో అయ్యప్ప స్వామి వారు ఆ పట్టీతోనే దర్శనమిస్తారు.


End of Article

You may also like