టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారి, తర్వాత అదే సినిమా రీమేక్‌ కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేష‌న‌ల్ హిట్‌ను సాధించి తెలుగు ఇండ‌స్ట్రీని త‌న వైపు తిరిగి చూసేలా చేసుకున్న ద‌ర్శ‌కుడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స్టార్ హీరోగా నిలబెట్టాడు.

Video Advertisement

 

 

అయితే ఈ రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశారు. ‘యానిమల్’ పేరుతో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో సినిమా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసారు. అయితే “ఈ చిత్ర కథ విన్న తర్వాత ..రెస్ట్ రూమ్ కి వెళ్లి ఒకసారి అద్దంలో చూసుకొని చాలా భయపడ్డాను. కెరియర్లో ఇలాంటి కథ పాత్ర చేయడం మొదటిసారి అని చాలా భయపడ్డాను ఈ కథకు నేను న్యాయం చేయగలనా అనిపించింది” అని రణబీర్ తెలిపారు. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఆసక్తికరమైన గ్యాంగ్ స్టర్ డ్రామాగా యానిమల్ సినిమా ఉంటుందని సమాచారం.

why mahesh rejected animal movie..!!

అయితే ఈ చిత్రాన్ని మొదట మహేష్ బాబు కి చెప్పగా తండ్రీ కొడుకుల మధ్య సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా తన పర్సనాలిటీ కి సరిపోదని మహేష్ రిజెక్ట్ చేసారని తెలుస్తోంది. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ తో బోల్డ్ ప్రెజెంటేష‌న్ ఇచ్చిన సందీప్‌కు బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో మహేష్‌బాబుకు చెప్పిన కథతోనే అక్కడ సినిమా తీసేస్తున్నాడు అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.

why mahesh rejected animal movie..!!

బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే సౌత్ సినిమాలలో హింస కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే బాలీవుడ్లో హింస చాలా తక్కువే అని చెప్పాలి హిందీ ప్రేక్షకులకు అభిరుచి తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటూనే సౌత్ ప్రేక్షకులకు అభిరుచి తగ్గట్టుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ గతంలోనే తెలిపారు. ఈ మూవీ లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. అనీల్ క‌పూర్‌, బాబీ డియోల్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం విడుదల అయిన తర్వాత ఎటువంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.