Ads
అన్నిటికంటే వేగంగా ప్రయాణించే వాటిలో ఒకటి మనిషి మెదడు, ఇంకా ఆ మెదడులో వచ్చే ఆలోచనలు. ఒక మనిషి ఒకటే చోట కూర్చొని ప్రపంచం మొత్తం గురించి ఆలోచించగలరు. అందులో కొన్ని మామూలు ఆలోచనలు ఉంటే ఇంకొన్ని మాత్రం సందేహాలు ఉంటాయి. అలా చాలా మందికి వచ్చే సందేహాల్లో ఒకటి ఏంటంటే “వేడి చేసినప్పుడు పాలు ఎందుకు పొంగుతాయి? నీళ్లు ఎందుకు పొంగవు? “.
Video Advertisement
ఈ ప్రశ్నకి చాలా మందికి సమాధానం తెలిసి ఉండొచ్చు. కొంత మందికి సమాధానం తెలియకపోయి ఉండొచ్చు. వేడి చేసినప్పుడు పాలు ఎందుకు పొంగుతాయో, నీళ్లు ఎందుకు పొంగవో ఇప్పుడు తెలుసుకుందాం. నీళ్లు వేడి చేసినప్పుడు అది నీటి ఆవిరిగా మారి బయటికి వస్తుంది. కానీ పాలలో నీళ్ళు మాత్రమే కాకుండా వేరే పదార్థాలు కూడా ఉంటాయి.
పాలలో 87.3 శాతం నీళ్లు ఉండగా, 3.9 శాతం ఫ్యాట్ పదార్థాలు, 8.8 శాతం నాన్ ఫ్యాట్ సాలిడ్ పదార్థాలు, ప్రోటీన్స్, షుగర్స్ ఉంటాయి. మనం పాలను వేడి చేసినప్పుడు పాలలో ఉండే ఈ పదార్థాలు అన్నీ పాల నుండి విడిపోతాయి. అవి పాల కన్నా తేలికగా ఉంటాయి. దాంతో మరుగుతున్నప్పుడు పాల పైభాగానికి చేరుకొని, అక్కడ ఒక పొరలాగా ఫామ్ అవుతుంది.
పాలలో ఉండే నీరు వేడి చేసినప్పుడు ఆవిరిగా మారి బయటికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పై భాగంలో ఏర్పడిన పొర నీటిని బయటికి వెళ్లకుండా ఆపుతుంది. వేడి ఎక్కువవుతున్నకొద్దీ నీటి ఆవిరి పెరుగుతుంది. దాంతో ప్రెజర్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఆ నీటి ఆవిరి బయటికి వెళ్లడానికి పై భాగంలో ఏర్పడిన పొరని దాటుకొని వెళ్తుంది. అప్పుడే పాలు పొంగుతాయి.
చాలా మంది పాలు కాగుతున్నప్పుడు మధ్య మధ్యలో పాలని గరిటతో తిప్పుతారు. అప్పుడు పొర పక్కకు జరుగుతుంది దాంతో లోపల ఏర్పడిన ఆవిరి బయటికి వెళ్లిపోతుంది. అప్పుడు పాలు పొంగవు. నీటిలో ఫ్యాట్ పదార్థాలు ఉండవు కాబట్టి లేయర్ ఏర్పడడం లాంటివి, ఆవిరి బయటికి వెళ్లకుండా ఆగడం లాంటివి జరగవు. అందుకే నీరు ఎప్పుడూ పొంగవు.
End of Article