Ads
మెట్లెక్కడం మానేసి లిఫ్ట్ లలో తిరగడం మనకి బాగా అలవాటైపోయింది. లిఫ్ట్ ఎక్కగానే మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే.. మిర్రర్ లో మన ఫేస్ చూసుకోవడం.. హెయిర్ స్టైల్ చూసుకోవడం. అసలు మిర్రర్ పెట్టిందే మనకోసం అని ఫీల్ అయిపోతాం. కానీ, అసలు లిఫ్ట్ లలో మిర్రర్ లు ఎందుకు పెడతారో తెలుసా..? ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
Video Advertisement
లిఫ్ట్ ఎక్కగానే అందరు ఫేస్ నే చెక్ చేసుకుంటారు. కానీ లిఫ్ట్ లో మిర్రర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అసలు మిర్రర్స్ ని పెట్టింది సేఫ్టీ పర్పస్ కోసం. లిఫ్ట్ లో ఉన్నపుడు మనతో పాటు చాలామంది ఎక్కుతారు. మనం మిర్రర్ వైపు చూస్తూ అందరిని గమనించవచ్చు. గుంపు లో ఎవరైనా దొంగతనానికి పాల్పడుతున్నా, లేక మరేదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న తేలికగా గుర్తించవచ్చు.
లిఫ్ట్ లలో అద్దాలను మొదటిసారి జపాన్ దేశం ప్రవేశపెట్టింది. వికలాంగులకు, వీల్ చైర్ వినియోగదారులకు మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందికరం. అలాంటి వారికి లిఫ్ట్ లు సౌలభ్యం గా ఉంటాయి. కానీ వీరు వీల్ చైర్ లో కూర్చుని వెనక్కి తిప్పడం కొంత కష్టతరం గా ఉంటుంది. ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అదే మిర్రర్ ఉంటె.. వెనుక నుంచునే వ్యక్తి సేఫ్ గా వీల్ చైర్ ను తిప్పడం సాధ్యమవుతుంది.
ఎక్కువ ప్లేస్ లేకపోవడం, స్వచ్ఛమైన గాలి తగలేకపోవడం వంటి కారణాల వలన చాలా మందికి క్లాస్ట్రోఫోబియా సమస్య ఎదురవుతుంటుంది. ఇది వారిలో ఆందోళన పెంచుతుంది. ఫలితం గా వారి గుండె చప్పుడు వేగం పెరిగి అరచేతిలో చెమటలు పడుతుంటాయి. అదే లిఫ్ట్ లో అద్దం ఉండడం వలన ఈ ఆందోళనలను తగ్గిస్తుంది. లిఫ్ట్ ఇరుకుగా ఉందనే ఫీల్ లేకుండా చేస్తుంది.
లిఫ్ట్ లో బోరు గా నుంచునే బదులు అద్దం లో వారి రూపాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇతరులను గమనిస్తూ ఉంటారు. అదే అద్దం లేకపోతె నేల చూపులు చూస్తూ ఉండాలి. లిఫ్ట్ లో ఉండే ఐదు నిముషాలు కూడా ఎక్కువ కాలం గడిపిన భావన కలుగుతుంటుంది. అద్దం లో రూపాన్ని చూసుకుంటూ ఉండడం వలన లిఫ్ట్ లో ఉన్నంత సేపు వారికి పడిపోతున్నామేమో నన్న భయం కలగకుండా ఉంటుంది.
End of Article