మంగళవారం, శుక్రవారం డబ్బులు దానం చేయద్దు, తీసుకోవద్దు అంటారు…దానికి వెనకున్న కారణం ఏంటి?

మంగళవారం, శుక్రవారం డబ్బులు దానం చేయద్దు, తీసుకోవద్దు అంటారు…దానికి వెనకున్న కారణం ఏంటి?

by Megha Varna

Ads

మన సంప్రదాయాలు,సంస్కృతులు ప్రపంచంలో ఎంతో ప్రాచీనమైనవి అలాగే అద్భుతమైనవి అలాంటి మన సంప్రదాయాలలో కొందరి ఔత్సాహికుల పుణ్యాన కొన్ని అర్థం పర్థం లేని నియమాలు చేర్చడంతో మన సంప్రదాయాలు కొన్ని శతాబ్దాలపాటు చులకన అయ్యాయి.

Video Advertisement

ఇక ఇప్పుడిప్పుడే ప్రపంచానికి అలాగే మనకు మన సంప్రదాయాల విలువ తెలుస్తుంది.మన దేశంలో చాలామంది ఇప్పటికీ మంగళవారం,శుక్రవారం డబ్బులు అప్పు ఇవ్వరు అలాగే తీసుకోరు దీని కారణమేంటో తెలుసా?

మంగళవారం,శుక్రవారం లక్ష్మికి ప్రీతికరమైన రోజు అందుకే ఈరోజుల్లో లక్ష్మిని వేరొకరికి ఇస్తే మన ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చాలామంది నమ్ముతారు. అందుకే ఈరోజుల్లో సాధారణంగా జనాలు డబ్బుల ట్రాన్సాక్షన్స్ చెయ్యరు.కానీ శాస్త్రాలలో ఎక్కడ మంగళవారం,శుక్రవారం డబ్బులు ఇవ్వవద్దని కాని తీసుకోవద్దని కాని చెప్పలేదు.

మరి ఈ ఆచారం ఎలా వచ్చిందంటే మంగళవారం కుజుడు ఆధీనంలో ఉంటాడు.కుజుడు ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమం ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగితే అది గొడవలకు దారి తీస్తుందని మంగళవారం లేదా లక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం రోజులలో డబ్బులు ఇవ్వకూడదని ఓ ఆచారం ఏర్పడింది.అందుకే ప్రజలు ఈ రెండు రోజులలో డబ్బులు ఇవ్వరు.


End of Article

You may also like