స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. సీరియల్స్ లో సూపర్ హిట్ అది. దాని రికార్డులు ఇప్పటి వరకు వేరే ఏ సీరియల్ కి లేవు. క్రికెట్ మ్యాచ్ ల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని ఈ సీరియల్ ముందు తేలిపోయాయి. ఈ సీరియల్స్ లో నటులకి ఉన్నంత క్రేజ్ సినిమా హీరోలకి కూడా లేదు.

Video Advertisement

 

ఈ సీరియల్ లో వంటలక్క అయిన ప్రేమీ విశ్వనాధ్, డాక్టర్ బాబు అయిన నిరుపమ్, సౌందర్య అయిన అర్చన అనంత్ ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాగే ఈ సీరియల్ లో నెగటివ్ పాత్రలో నటించిన మోనిత కి కూడా ఫాన్స్ ఎక్కువ మందే ఉన్నారు. అయితే కార్తీక దీపం సీరియల్ లో తన పాత్ర ముగిసిందంటూ ఇటీవల శోభా శెట్టి తన యూట్యూబ్ వీడియో లో పంచుకున్నారు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి.

why monitha charecter ends in karthika deepam..??

అయితే తనను కావాలనే కార్తీక దీపం నుంచి తొలగించారంటూ శోభా శెట్టి చెప్పుకొచ్చింది. ” నా లైఫ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించాను. ఇంత ఫేమ్ ఎప్పుడు రాలేదు. ఇంతలా ఎప్పుడూ బాధపడలేదు. రీ ఎంట్రీ తర్వాత 5 నెలలు మాత్రమే వర్క్ చేశాను. కార్తీక దీపం నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అయ్యి కూర్చున్నాను. జైలుకు వెళ్లినట్లు పెట్టారు.. జైలుకు వెళ్లొచ్చాక నా రీఎంట్రీ మళ్ళీ ఉంటుందని ఆశించాను.

why monitha charecter ends in karthika deepam..??

కానీ నా పాత్రను తొలగించినట్టు చెప్పారు. కథ ప్రకారం మోనిత గురించి కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కాబట్టి. మోనిత స్నేహితురాలు అయిన చారుశీలని రంగంలోకి దించారు. ఇప్పుడు కథ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మళ్ళీ నా పాత్ర తిరిగి వచ్చినప్పుడు అసలు మజా వస్తుంది. ” అని చెబుతూ ఎమోషనల్ అయింది శోభా శెట్టి.