Ads
రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. దీన్నే రోజా అని పిలుస్తారు. రోజాను ఖర్జూర పండుతోనే విడుస్తారు.. దీనికి ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ , జియోగ్రాఫికల్ కారణాలున్నాయి….అవేంటో ఇప్పుడు చూద్దాం.!
Video Advertisement
ఆధ్యాత్మిక కారణం :
ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ లో ఖర్జురాల ప్రస్తావన ఉంది.మహమ్మద్ ప్రవక్త రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లింలు తమ రోజాను ఖర్జూరాలను తినడం ద్వారా విడిచిపెట్టాలని చెప్పారు.
సైంటిఫిక్ కారణాలు:
ఖర్జూరాల వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల ఎక్కువ సేపు ఉపవాసం ఉన్నవారు అతిగా తినకుండా ఉంటారు. ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు, ఫైబర్ (పీచు పదార్థం), మినరల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ తదితర పోషకాలు కూడా వీటిల్లో ఉంటాయి. అందువల్ల ఇవి చాలా తేలిగ్గా జీర్ణం కావడమే కాదు.. ఎక్కువ సేపు ఉపవాసం ఉన్నాక వీటిని తింటే శరీరానికి కావల్సిన శక్తి వెంటనే లభిస్తుంది.
జియోగ్రాఫికల్:
ఇస్లాం మతం సౌదీ అరేబియా లో పుట్టిన మతం .. ఇక్కడ ఖర్జూరాలు ఎక్కువగా పండుతాయి ..కాబట్టి చౌకగా దొరుకుతాయి. అందుకే ఉపవాస దీక్ష వీటితో విరమిస్తారని ఒక భావన.
వివిధ దేశాల్లో ఇఫ్తార్ లో ఉండే స్పెషల్ ఐటమ్స్ ఇవే..!
ఆఫ్గనిస్తాన్…
వీరు ఇఫ్తార్ విందుల్లో ఖర్జూరాలు, శోరువా, కబాబ్స్, కాబూలీ పులావ్, డు పియాజా (ఉల్లిపాయలు, మాంసం సూప్), మాంటో (మాంసం పాస్తా), బొలని (కూరగాయల బ్రెడ్), రైస్, ఇతర తీపి పదార్థాలు తింటారు.
బంగ్లాదేశ్...
బంగ్లాదేశ్‌లో ఇఫ్తార్ సందర్భంగా పియాజు (పప్పు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరప కాయల వంటకం), బెగుని (శనగపిండి, వంకాయలతో చేసే వంటకం), జిలాపి, చానా-మురి, హలీం, ఖర్జూరాలు, సమోసాలు, దాల్ పూరీ, చోలా, కబాబ్స్, మొగ్‌లాయ్ పరోటా, బెంగాలీ స్వీట్లు, పుచ్చకాయలు తింటారు. అలాగే లెమన్ షర్బత్, పెరుగు తాగుతారు.
బ్రూనె…
ఈ దేశంలో వీరు స్థానికంగా వండే వంటకాలను ఇఫ్తార్ సందర్భంగా ఎక్కువగా తింటారు. మాంసంతో తయారు చేసే కబాబ్‌లు, రైస్‌ను ఎక్కువగా తింటారు.
ఇండియా...
భారత్‌లో ఉండే ముస్లింలు ఇఫ్తార్ సందర్భంగా.. హలీంను ఎక్కువగా తింటారు. దీంతోపాటు జ్యూస్‌లు, షర్బత్‌లు తాగుతారు. అలాగే బిర్యానీలు, తాజా పండ్లు, సమోసాలు ఎక్కువగా భుజిస్తారు. ఇక కొన్ని ప్రాంతాల వారు బొండాలు, బజ్జీలు, వడలు, పకోడీలను కూడా ఇఫ్తార్ విందులలో తింటుంటారు.
ఇండోనేషియా…
ఈ దేశం వారు కొలక్ అనే తీపిపదార్థాన్ని ఇఫ్తార్ విందులో తింటారు. అలాగే కెలాపా ముదా, ఎస్ బువా, ఎస్ కంపార్, సెండాల్, దావెట్ తదితర వంటకాలను, స్వీట్లను తింటారు.
ఇరాన్…
ఇరాన్‌లో స్వీట్లు, చాయ్, ఆకుపచ్చని కూరగాయలతో చేసిన వంటకాలు, మాంసం వంటకాలను ఇఫ్తార్ విందుల్లో తింటారు.
మలేషియా...
ఈ దేశంలో తాజా ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు, చెరుకు రసం, సోయాబీన్ మిల్క్, బాన్‌డుంగ్ డ్రింక్, గ్రాస్ జెల్లీ, నాసీ లెమక్, లక్సా, అయం పెర్సిక్, చికెన్ రైస్, సతయ్, పొపియా తదితర ఆహారాలను తీసుకుంటారు.
మాల్దీవ్స్…
తాజా ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు, చల్లని ఫ్రూజ్ జ్యూస్‌లు, స్వీట్లు, చేపలు, కర్రీలు, రోషి, సలాడ్లు తదితర ఆహారాలను వీరు ఇఫ్తార్‌లలో తింటారు.
నైజీరియా...
జొలొఫ్ రైస్, సుయా, ఒబె ఎగుసి, ఎవురె, ఆకారా, దబిను, ఒపొటొ తదితర వంటలను వీరు ఇఫ్తార్ విందుల్లో రుచి చూస్తారు.
పాకిస్థాన్…
ఖర్జూరాలు, జిలేబీలు, సమోసాలు, నమక్ పారా, చికెన్ రోల్స్, స్ప్రింగ్ రోల్స్, షమీ కబాబ్స్, ఫ్రూట్ సలాడ్స్, చనా చాట్, దహీ బలై, నూడుల్ సూప్, ఇతర మాంసాహారాన్ని వీరు ఇఫ్తార్‌లో తింటారు.’
రష్యా, ఉక్రెయిన్…
ఈ దేశాల్లో.. ఖర్జూరాలు, పండ్లు, బెస్బార్‌మాక్, కుర్జె తదితర స్థానిక వంటకాలను ఇఫ్తార్‌లో తింటారు.
సింగపూర్…
వీరు స్వీట్ డ్రింక్స్ సేవిస్తారు. రైస్, నూడుల్స్‌తో తయారు చేసే వంటకాలను తింటారు.
శ్రీలంక… వీరు సమోసా, కట్లెట్లు, రోల్స్, కాంజీ, ఫలూదా తదితర ఆహారాలను ఇఫ్తార్ సమయంలో ఎక్కువగా తీసుకుంటారు.
తైవాన్… ఈ దేశంలోని ముస్లింలు ఖర్జూరాలను ఎక్కువగా ఇఫ్తార్ విందుల్లో తింటారు.
ట్రినిడాడ్ అండ్ టొబాగో…
ఈ దేశంలోని ముస్లింలు రైస్, రోటీ, చికెన్, మేక మాంసం, బాతు మాంసం, శనగలు, ఆలుగడ్డలు తదితర ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు.
టర్కీ…
వీరు సూప్‌లు, ఖర్జూరాలు, చీజ్, పాస్తా, సుజుక్, రంజాన్ పిదేసి, గల్లక్ తదితర స్థానిక వంటకాలను ఎక్కువగా తీసుకుంటారు.
అమెరికా, కెనడా…
ఈ దేశాల్లో ఉండే ముస్లింలు.. ఇతర దేశస్థుల లాగానే ఖర్జూరాలు, సాంప్రదాయ మాంసం వంటకాలను ఇఫ్తార్ విందుల్లో ఎక్కువగా తింటుంటారు.
End of Article