సినీ ప్రముఖులు చనిపోయినప్పుడు “నాగార్జున” చూడటానికి ఎందుకు వెళ్ళలేదు..? దాని వెనుక ఉన్న కారణం ఇదేనా..?

సినీ ప్రముఖులు చనిపోయినప్పుడు “నాగార్జున” చూడటానికి ఎందుకు వెళ్ళలేదు..? దాని వెనుక ఉన్న కారణం ఇదేనా..?

by Anudeep

Ads

తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఏడాది కాలంలో సెలెబ్రిటీల మరణవార్తలు విన్పిస్తున్నాయి. అలనాటి తరం లోని దిగ్గజ నటులు ఈ ఏడాది మరణించారు. మొన్న కృష్ణంరాజు, నిన్న సూపర్‌స్టార్ కృష్ణ మరణించగా..ఇప్పుడు కైకాల సత్యనారాయణ, చలపతిరావులు కన్నుమూశారు. మొత్తం సినీ పరిశ్రమ అంతా నివాళి అర్పించింది.

Video Advertisement

 

సినిమా ఇండస్ట్రీ లో అందరు మంచి చెడు కలిసే పంచుకుంటారు.ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమం అయినా మరొకరు కుటుంబాలతో సహా వెళ్తారు. కానీ ఇందరు దిగ్గజ నటులు చనిపోయినా నాగార్జున వారిని కడసారి చూడటానికి వెళ్ళకపోవడం పై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ నాగ చైతన్య, అఖిల్ ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

why nagarjuna not attending celebreties final rights..!!

అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు పరిశ్రమ మొత్తం కలిసి వచ్చి, కదలి వచ్చి ఆయనకు ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అంతే కాదు అలా వ‌చ్చిన వారంద‌రూ.. క‌న్నీరు పెట్టుకుంటున్న నాగ్‌కి ధైర్యం చెప్పారు. నాగార్జున పుట్టింది, పెరిగింది అంతా ఇండస్ట్రీలోనే. 100 సినిమాలకు దగ్గర పడ్డాడు. ప్రతి నటుడితో… నేటి తరం, నిన్నటి తరం, కొత్త తరంతో ఆయనకు మంచి అనుబంధము ఉంది. కానీ తన తండ్రికి సమకాలీకులైన వారు మరణిస్తే కడ‌చూపుకి కూడా వెళ్లడం లేదు.

why nagarjuna not attending celebreties final rights..!!

నాగార్జున సినిమాల్లో కైకాల సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కామెడీ విలన్‌గా ఎన్నో పాత్రలు చేశారు. అంతేకాదు తన తండ్రి అయిన ఏఎన్ఆర్‌కు కైకాల ఆప్తమిత్రుడు. అయినా నాగార్జున స్పందించలేదు. వారసుడు అనే సినిమాలో కృష్ణ నాగార్జున కలిసి నటించారు. అయినా టాలీవుడ్ సూపర్ స్టార్ మరణంపై నాగార్జున పెద్దగా స్పందించలేదు. భౌతికకాయం సందర్శించలేదు. అలాగే కృష్ణం రాజు చనిపోయినా నాగార్జున ఇలాగే ప్రవర్తించాడు.

 

why nagarjuna not attending celebreties final rights..!!

అయితే నాగార్జున ఇలా మ‌ర‌ణించిన పెద్ద‌ల భౌతిక దేహాల‌ను సంద‌ర్శించి నివాళులు అర్పించ‌కపోవడానికి కారణం చనిపోయిన వ్యక్తులను చూడాలంటే భయమా? లేక పార్థీవదేహాలను సందర్శించడం అపశకునంగా భావిస్తున్నారా? అనే సందేహాలు ఫాన్స్ లో మొదలయ్యాయి. మరణించిన వ్యక్తులను చివరి చూపు చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎన్నో వేల మైళ్ల దూరం నుంచి వస్తారు. మరి నాగార్జున ఇలా ఎందుకు చేస్తున్నారో ఆయన స్పందిస్తే గానీ తెలీదు.


End of Article

You may also like