సినిమాల్లో వస్తువులు ఎందుకు అంత తేలికగా పగిలిపోతాయో మీకు తెలుసా..? దీని వెనుక ఇంత స్కెచ్ ఉందా..?

సినిమాల్లో వస్తువులు ఎందుకు అంత తేలికగా పగిలిపోతాయో మీకు తెలుసా..? దీని వెనుక ఇంత స్కెచ్ ఉందా..?

by Megha Varna

Ads

సాధారణంగా మనం సినిమాల్లో చూస్తే హీరో ఫైట్స్ చేసినప్పుడు తేలికగా అక్కడ ఉన్న వస్తువులు పగిలిపోతూ ఉంటాయి. అయితే ఎలా సినిమాల్లో వస్తువులు తేలికగా పగిలిపోతాయి..? రియాలిటీలో అయితే వస్తువులు స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ సినిమాల్లో ఫైట్ సీన్లు వంటివి జరిగినప్పుడు వస్తువులు తేలికగా ఎలా పగిలి పోతుంటాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

హీరోలు ఫైట్లు చేసినప్పుడు అక్కడ ఉండే వస్తువులన్నీ కూడా సులభంగా పగిలి పోతుంటాయి. బాటిల్స్ మొదలు గోడలు, రాళ్లు ఇలా చాలా వస్తువులు ఈజీగా పగిలిపోతుంటాయి. ఈ అనుమానం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా కలిగిందా..? మరి క్లారిటీగా దీనికోసం ఇప్పుడే చూసేద్దాం.

ఈ వస్తువులు తయారు చేయడం లోనే చిన్న మ్యాజిక్ ఉంది. అందుకనే ఇవి ఈజీగా పగిలిపోతాయి. ఒక వస్తువుని తీసుకుని దానిని మౌల్ట్ లో పెట్టి ఆకారం వచ్చే విధంగా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అందులో ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ని వేస్తారు. అయితే చూడడానికి ఇది గాజు బాటిల్ లాగే ఉంటుంది కానీ గాజు బాటిల్ కాదు. అందుకనే ఇది సులభంగా బ్రేక్ అవుతుంది.

అలానే రాళ్ళు, కుర్చీలు విషయానికి వస్తే వీటిని వాక్యూమ్ చేసి త్రీడీ పెయింటింగ్ వేస్తారు. ఇది నిజమైన వస్తువే కానీ వస్తువు లోపల మాలిక్యులర్ బాండ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత సులభంగా బ్రేక్ అయిపోతాయి. ఇక అద్దాలు వంటి వాటిని ఉపయోగించేటప్పుడు అద్దాలని థిన్ వ్యాక్స్ తో తయారు చేస్తారు. ఈ మెటీరియల్ రబ్బర్ మాదిరి ఉంటుంది. ఒకవేళ ఈ అద్దం పగిలినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఇలాంటి వస్తువులుని సినిమాల్లో ఉపయోగిస్తూ ఉంటారు.


End of Article

You may also like