పాండవుల మరణం తర్వాత… “ధర్మరాజు” మాత్రమే స్వర్గానికి ఎందుకు వెళ్ళాడు..? ఆయన చేసిన మంచి పని ఏంటి..?

పాండవుల మరణం తర్వాత… “ధర్మరాజు” మాత్రమే స్వర్గానికి ఎందుకు వెళ్ళాడు..? ఆయన చేసిన మంచి పని ఏంటి..?

by kavitha

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత సుమారు 36 సంవత్సరాల పాటు పాండవులు హస్తినపుర రాజ్యాన్ని పాలించారు. శ్రీకృష్ణుడు, బలరాముడు తమ దేహాలను వదిలి అవతారాలను ముగిస్తారు.

Video Advertisement

ఈ విషయం తెలిసిన పాండవులు రాజ్యాన్ని త్యజించి, తమ శరీరాలతోనే స్వర్గాన్ని చేరుకోవాలని భావిస్తారు. అలా  పాండవులు, ద్రౌపది తమ చివరి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు విడిచిపెట్టారు. దారిలో ద్రౌపది ముందుగా మరణిస్తుంది. కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పాండవులు మరియు ద్రౌపది మరణం గురించి మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో చెప్పబడింది. పాండవులు హస్తిన పురాన్ని విడిచి వెళ్లేముందు అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ ను రాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత  హిమాలయాలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వీరిని ఒక కుక్క అనుసరిస్తుంది. పాండవులు ద్రౌపదితో దారిలో కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని హిమాలయాలను దాటరు. ఈ క్రమంలో ముందుగా ద్రౌపది క్రింద పడి మరణిస్తుంది.అప్పుడు భీముడు ద్రౌపది మరణానికి ధర్మరాజుని కారణం అడుగుతాడు. దానికి ద్రౌపదికి పాండవులు అందరు భర్తలు అయినప్పటికీ, ఆమె అర్జునుడి పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటుందని చెప్పాడు. ప్రయాణం సాగిస్తూ ఉండగా సహదేవుడు పడిపోయాడు. అప్పుడు భీముడు సహదేవుడు ఎందుకు పడిపోయాడు అని అడిగినపుడు తనకున్న జ్ఞానానికి అతడు ఎల్లపుడూ గర్వంతో ఉండేవాడని అందువల్లనే అతను పడిపోయాడని చెప్పాడు. ఆ తరువాత నకులుడు కింద పడిపోగా, ధర్మరాజు భీమునితో నకులుడు తన అందం పట్ల ఎక్కువగా గర్వపడ్డాడు. ఆ పాపం వల్లే పడిపోయాడని చెప్పాడు.
ఆ తర్వాత అర్జునుడు పడిపోయినపుడు, ధర్మరాజు భీమునితో  యుద్ధానికి ముందు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధాన్ని తన శక్తితో ఒక్కరోజులోనే ముగించగలనన్న నమ్మకంతో ఉండేవాడని, కానీ అలా చేయలేకపోయాడని, అంతేకాకుండా, అతను ఎప్పుడూ ఇతర విలువిద్య నిపుణులను తక్కువ చూసేవాడని చెప్పాడు. అయితే ఆ తరువాత భీముడు పడిపోతూ నేనేం పాపం చేశాను అని అడిగినపుడు ధర్మరాజు నువ్వు అతిగా తినేవాడివని, నీ శక్తి సామర్ధ్యాల గురించి ప్రగల్భాలు చెప్పేవాడివని, ఇతరులను అగౌరవపరిచేవాడివని చెప్పాడు. చివరగా ధర్మరాజు ముందుకు వెళ్ళగా ఆయనను కుక్కను అనుసస్తుంది. వారి ముందు ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి స్వర్గానికి తీసుకెళ్తానని చెప్పగా, డానికి ధర్మరాజు ద్రౌపదిని, తన సోదరులను కూడా వెంట స్వర్గానికి తీసుకెళ్లాలని అడుగుతాడు. ఇంద్రుడు వారు ఇప్పటికే స్వర్గానికి చేరుకున్నారని చెప్పడంతో, తనతో పాటు కుక్కను స్వర్గానికి  తీసుకెళ్లలాని కోరుతాడు. కుక్కకు స్వర్గ ప్రవేశం లేదని చెప్పడంతో అక్కడే ఉండిపోతానని ధర్మరాజు చెప్తాడు.  అప్పుడు ఆ కుక్క యమధర్మరాజుగా మారి తన గొప్పతనాన్ని పరీక్షించడానికి వచ్చానని వెల్లడిస్తాడు. పాండవులలో ఒక్క ధర్మరాజు మాత్రమే శరీరంతో స్వర్గంలో ప్రవేశిస్తాడు.

Also Read: “ద్వారకా నగరం” ఇప్పటికీ ఉందా..? పరిశోధకులు ఏం చెప్తున్నారు అంటే..?


You may also like