Ads
గత కొద్ది కాలం నుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పదాల్లో నేషనల్ క్రష్ అనే పదం ఒకటి. గత సంవత్సరం హీరోయిన్ రష్మిక మందనని నేషనల్ క్రష్ గా ప్రకటించారు. అంతకు ముందు ప్రియా ప్రకాష్ వారియర్ ని కూడా ఇదే పేరుతో పిలిచారు. వీరు మాత్రమే కాకుండా ఇంకొంతమంది సెలబ్రిటీలను కూడా ఇలాగే నేషనల్ క్రష్ అని అన్నారు.
Video Advertisement
కానీ ఒకసారి గమనిస్తే ఇలా నేషనల్ క్రష్ అని ప్రకటించిన వారు అందరూ కూడా అమ్మాయిలే. సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఆడవాళ్లు మాత్రమే కాకుండా మగవాళ్ళు కూడా ఉంటారు. వాళ్లకి కూడా క్రేజ్ తక్కువ ఉండదు.
కానీ నేషనల్ క్రష్ విషయానికి వస్తే కేవలం అమ్మాయిలని మాత్రమే నేషనల్ క్రష్ గా ప్రకటించారు. దీనికి కారణం ఏంటి అని కోరాలో ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి కొంత మంది నెటిజన్లు ఈ విధంగా సమాధానం చెప్పారు. దీనికి ఒకరు చెప్పిన సమాధానం ఏంటంటే, “అమ్మాయిలకంటే అబ్బాయిలు ఎక్కువగా వ్యక్తపరుస్తారు. ఒకవేళ అమ్మాయిలకి క్రష్ ఉన్నా కూడా ఆ విషయంపై ఎక్కువగా మాట్లాడరు. అమ్మాయిలకి ఒప్పుకునే స్వభావం తక్కువ. ఎక్కడో కొన్ని చోట్ల తప్ప అమ్మాయిలు అంత సులభంగా వారి అభిప్రాయాన్ని వ్యక్త పరచలేరు. అందుకే సోషల్ మీడియాలో అయినా సరే సాధారణంగా అమ్మాయిలకి క్రష్ ఉండే హీరోల గురించి అంత ఎక్కువగా పోస్ట్ రావు.”
“అందుకే సైకాలజీ ప్రకారం అమ్మాయిలకి వారి క్రష్ గురించి చెప్పడం తక్కువ కాబట్టి నేషనల్ క్రష్ అంటే ముందుగా ఆడవారు మాత్రమే ఉంటారు.” ఇదే విషయంపై మరొకరు ఏమన్నారంటే, “ఒకవేళ అమ్మాయిలకి ఉన్నా కూడా బయటకు చెప్పడానికి ధైర్యం సరిపోదు. అంతేకాకుండా చాలా మంది అమ్మాయిలకు అవన్నీ ఆలోచించే పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం, లేదా మనం ఎప్పటినుంచో పెరిగిన విధానం ప్రకారం అమ్మాయిలు పెరిగే విధానం కానీ, అబ్బాయిలు పెరిగే విధానం కానీ వేరేలాగా ఉంటుంది. ఒక అమ్మాయికి, “నువ్వు చదువుకోవాలి. తర్వాత వేరే ఇంటికి వెళ్లిపోవాలి” అని పెంచుతారు.”
“కానీ అబ్బాయిలకి మాత్రం, “నువ్వు చదువుకోవాలి. ఆ తర్వాత ఉద్యోగం చెయ్యాలి” అని పెంచుతారు. దాంతో అమ్మాయిలకి అంత ఎక్కువ టైం ఉండదు. కానీ అబ్బాయిలకి మాత్రం అలా ఉండదు కాబట్టి వారికి ఆలోచించే స్వేచ్ఛ ఉంటుంది. అమ్మాయిలకి ముందు నుండి కూడా చాలా నియమ నిబంధనలు ఉంటాయి. అందుకే ఇవన్నీ ఆలోచించలేరు” అని రాశారు. ఈ రెండు జవాబులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి సైకాలజీ ప్రకారం చెప్తే మరొకటి మన దేశంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచే విధానాన్ని బట్టి చెప్పారు. ఒకరకంగా చూస్తే రెండు కూడా కరెక్ట్ గానే అనిపిస్తాయి. ఇంటర్నెట్ సర్వే లాంటివి కూడా మనుషుల ఆలోచనలని బట్టే అవుతుంది కాబట్టి అందులో వచ్చే జవాబులు కూడా మనుషుల సైకాలజీ ప్రకారం మాత్రమే ఉంటాయి.
End of Article