ఉదయం నుండి మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాము. నిజానికి రోజులో మనం ఎన్నో వాటితో స్పెండ్ చేస్తూ ఉంటాము. ఉద్యోగము ఇంట్లో పనులు ఇలా చాలా వాటితో మన టైమ్ అంతా కూడా సరిపోతూ ఉంటుంది. రాత్రి హాయిగా నిద్ర పోవాలని అనుకుంటూ ఉంటాము. రాత్రి మంచి నిద్రను పొందుతే ఉదయం ఉత్సాహంగా ఉంటుంది.

Video Advertisement

కానీ కొంత మంది రాత్రి నిద్ర పోయినప్పుడు నొప్పులు ఎక్కువగా ఉన్నాయని బాధ పడుతూ ఉంటారు. అయితే రాత్రి పూట నొప్పులు ఎక్కువగా వస్తాయా..? దీనికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

నిజంగా ఇటువంటి ఆసక్తికరమైన విషయాలని ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రి అయితే చాలు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మరి రాత్రి ఎందుకు నొప్పులు ఎక్కువవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

పంటి నొప్పి, కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు ఇలా ఏ విధమైన నొప్పి అయినా సరే ఉదయం పూట లైట్ గా ఉండి రాత్రి అయితే అవి ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్య నిపుణులు దాని వెనక గల రహస్యాన్ని ఇప్పుడు చెప్పారు. రాత్రిపూట నొప్పులు ఎక్కువైతే నిద్ర కూడా మనకి పట్టదు.

రాత్రిపూట నొప్పులు నిజంగా ఎందుకు ఎక్కువ అవుతాయా…?

సైన్స్ ప్రకారం చూస్తే.. నొప్పి మెదడుకి సంబంధించిన చర్య. అయితే నొప్పి ఎలా వస్తుంది..?, ఎంతవరకు వస్తుంది అనేది మెదడు మనకి హెచ్చరికల్ని పంపిస్తూ ఉంటుంది. అయితే స్పందన వేరు. నొప్పి వేరు. ఈ రెండు వేరు వేరు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి.

1960లలో పరిశోధకులు రోలాండ్ మేల్ జాక్, ఫ్యాట్రిక్ వాల్ కొన్ని సత్యాలు చెప్పారు.
నొప్పి సంకేతాలు వెన్నుపాములో ఉండే గేట బట్టి ఉంటుంది. నొప్పి యొక్క తీవ్రతను గేట్ ఏ నిర్ణయిస్తుంది.
ఈ ద్వారం క్లోజ్ చేసి ఉంటే నొప్పి తక్కువగా ఓపెన్ చేసి ఉంటే ఎక్కువగా ఉంటుంది.

body pains 1

ఇందుకే రాత్రిళ్ళు నొప్పి ఎక్కువవుతుంది:

చీకటిలో రాత్రి వేళలో మనం కూర్చున్నప్పుడు నొప్పి మీదే మన దృష్టి మొత్తం వెళ్తూ ఉంటుంది. దీనివలన వెన్నుపాములో డోర్ ని క్లోజ్ చేయలేము. దానితో నొప్పి బాగా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. జీవ గడియారం వలన కూడా నొప్పి ఆధారపడి వుంది. ఆలోచనలు, మెదడు మూలంగా నొప్పులు రాత్రిళ్ళు ఎక్కువవుతాయట.