కృష్ణుడితో జతగా రాధనే ఎందుకు పూజిస్తారు? రుక్మిణిని ఎందుకు పూజించరు?

కృష్ణుడితో జతగా రాధనే ఎందుకు పూజిస్తారు? రుక్మిణిని ఎందుకు పూజించరు?

by Megha Varna

Ads

హిందూ మతాన్ని సనాతన ధర్మమని అంటారు.మొదటగా అందరూ సనాతన దర్మం అనే పిలిచేవారు.కానీ క్రమంగా అందరూ హిందూ మతం అని పిలవడం ప్రారంభించారు.పురాణాలలో ఒకరు ఎలా పుట్టారు ఎక్కడివారు అని కాకుండా వారు ఎటువంటి ధర్మాన్ని పాటించారు ,ఎలా జీవించారు ,ఏ ఆదర్శాలను అమలులోకి తీసుకువచ్చారు అనే దానిమీదే ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యత ఆధారపడి ఉంటుంది.అయితే అసలు అందరూ రాధ కృష్ణ అని ఎందుకు అంటారు.ఎందుకని కృష్ణ రుక్మిణి అని అనారు..దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Video Advertisement

సనాతన దర్మం లో దశావతారాలలో ఒక్కో అవతారానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.రాముని అవతారంతో ధర్మ బద్దంగా ఎలా ఉండాలో తెలిపారు.కుర్మ అవతారంతో సాయం చెయ్యడమే దైవం అని తెలిపారు.ఈ విధంగా పురాణాలలో ఒక్కో పాత్రకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది అనే విషయం తెలుస్తూనే ఉంది.కృష్ణుడి అవతారంతో ఒక గురువు ఎలా ఉండాలో ,ఎదుటివారు దుఃఖంలో ఉన్నప్పుడ్డు వారితో ఎలా మాట్లాడాలో,ఎదుటివారికి సలహా ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలుస్తుంది.అయితే రాధ కృష్ణ చిన్ననాటి నుండి స్నేహితులు.అరణ్యంలో సరసు వడ్డున కృష్ణుడు వేణు నాదాన్ని పలికిస్తుంటే పులకించిపోయి తనను తాను మర్చిపోయేది.రాధ పాత్ర ద్వారా స్వార్ధరహితమైన  ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుంది.

రుక్మిణి పాత్ర ద్వారా ఓర్పు ,సహనం తో ఒక వ్యక్తి మౌనంగా ఎలా ఉండాలో తెలుస్తుంది.ఇక్కడ రాధ కంటే రుక్మిణి తక్కవని ఎంత మాత్రం కాదు.రాధ పాత్ర ప్రేమకు చిహ్నం కాబట్టి రాధ కృష్ణ అని అంటారు కానీ రుక్మిణి పాత్ర ఉద్దేశం ప్రేమ కాదు కదా.అందుకే ప్రేమికులు ఎలా ఉంటారో ఎలా ఉండాలో అనే విషయాన్నీ రాధ కృష్ణుల ద్వారా మనకు తెలుస్తుంది.అయితే కృష్ణ ,రుక్మిణి సమేత ఆలయాలు కూడా దేశంలో చాలానే ఉన్నాయి.అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే రాధ ,రుక్మిణి ఇద్దరు కూడా లక్ష్మి దేవి అవతారాలే. అయితే ఒక్కో అవతారం ఒక్కో విషయానికి చిహ్నం అవుతుంది .


End of Article

You may also like