Ads
శ్రీరామ జన్మస్థలం అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. వేలాది మంది ఎన్నో త్యాగాలు చేశారు. వారందరి కల సోమవారం నాడు సాకారం అయ్యింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ వేడుకని యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా చూసారు.
Video Advertisement
అయితే అయోధ్య రాముడిని “రామ్ లల్లా” అని ఎందుకు అంటారు అంటే. తులసీదాస్ చేత రచించబడిన రామ్ చరిత మానస లో బాల రాముడుని రామ్ లల్లా అని వర్ణించారు. ఈ పేరు చాలా ఫేమస్ అయిపోయింది. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే మనం చిన్నపిల్లలని చిన్ను, బుజ్జి, చిట్టి, కన్నా అని ఎలాగైతే ప్రేమతో పిలుస్తామో అలాగే అప్పట్లో అయోధ్యలో చిన్న పిల్లలని లల్లా అని పిలిచేవారట. ఐదు నుంచి ఆరేళ్ల వయసులో ఉన్న రాముడ్ని రామ్ లల్లా అని అప్పట్లో వాళ్ళు పిలిచేవారట. దాన్నే తులసీదాస్ తన రామ్ చరిత మానస్ లో వర్ణించారు. అందుకే అయోధ్య రాముడ్ని రామ్ లల్లా అనే పేరుతో పిలుస్తున్నారు.
గత శుక్రవారం నాడు శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యకి తరలించారు. అయితే ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు కూడా ఉండేలాగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఆ వివరణ కూడా ఎంతో చక్కగా రూపొందించారు అని విగ్రహం చూస్తుంటే తెలుస్తోంది.
అయితే ఈ విగ్రహం నల్లగా ఎందుకు ఉంది అని చాలామంది భక్తులకు డౌట్ వచ్చింది. గుడిలో విగ్రహాలకు సాధారణంగా అభిషేకం చేస్తారు. పాలతో అభిషేకం చేసినప్పుడు రాయి యొక్క మెరుపు తగ్గుతుంది. ఈ నల్లగా ఉండే రాయి మాత్రం మెరుపు తగ్గదు అంట. పైగా రాయి వెయ్యి సంవత్సరాలకు పైగా కూడా అరిగిపోదు అంట. అలాగే వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు ముదురు రంగులో ఎంతో అందంగా ఉన్నాడు అని వర్ణించారు. అందుకే రాముని విగ్రహం నల్లగా ఉంది.
End of Article