Ads
సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం తో వారిద్దరూ విడిపోయారని సోషల్ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి.
Video Advertisement
సమంత తన ట్విట్టర్ హేండిల్ లో అక్కినేని అనే పేరుని తొలగించి కేవలం “S” ను మాత్రమే ఉంచినప్పటి నుంచి ఈ అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు సమంత పెట్టె స్టేటస్ లు కూడా అనుమానాస్పదం గానే ఉంటూ వచ్చాయి. మరో వైపు నాగచైతన్య కానీ, అక్కినేని కుటుంబం గాని ఈ పుకార్లను ఖండించకుండా మౌనం వహిస్తుండడం తో సోషల్ మీడియా అంతా వీరిద్దరి గురించే చర్చ జరిగింది.
అసలు ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రశ్నిస్తున్నా.. సమంత గాని, చైతన్య గాని నోరువిప్పలేదు. వారు ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉండి.. అక్టోబర్ 2 నే చెప్పడానికి కారణం ఏంటబ్బా? అని నెటిజన్లు సైతం ఆలోచించేస్తున్నారు. గత నెల 24 వ తేదీన నాగ చైతన్య హీరో గా నటించిన “లవ్ స్టోరీ” సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యి.. మూవీ రిజల్ట్ తెలిసే వరకు విడాకుల గురించి చెప్పొద్దని ఈ జంట నిర్ణయించుకున్నారట.
ఈ సినిమా విడుదల అయ్యి ఓ వారం పైనే కావొస్తోంది. మూవీ కూడా బాగుంది అన్న హిట్ టాక్ కూడా వచ్చేసాక.. ఈ జంట తమ విడాకుల గురించి సోషల్ మీడియా లో అనౌన్స్ చేసేసారు. విడాకులు తీసుకుందాం అని నిర్ణయించుకున్నప్పటి నుంచే నాగచైతన్య ఓ పోష్ హోటల్ లోకి మకాం మార్చేసారట. దాదాపు నెల రోజుల నుంచి ఆయన ఒక్కరే ఉంటున్నారట. అక్కినేని కుటుంబం చాల పెద్దదే. ఇంతమంది ఉన్నా, నాగచైతన్య ఒంటరిగానే హోటల్ లో ఉండాల్సి వచ్చింది.
End of Article