Ads
ది ఫామిలీ మాన్ సిరీస్ 2 తో సమంత ఓటిటి వరల్డ్ లోకి కూడా అడుగుపెడుతున్నారు. ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లో సమంత నటన అందరికి పిచ్చ పిచ్చ గా నచ్చేసింది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఈ సిరీస్ షూటింగ్ టైం లో జరిగిన ఇన్సిడెంట్స్ ను సిరీస్ మేకర్స్ రాజ్, డీకేలు పంచుకున్నారు. ఈ సిరీస్ ట్రైలర్ లో సమంత డీ గ్లామర్ రోల్ లో కనిపించారు.. ఈ లుక్ చూసి ఫాన్స్ కొంతమంది బాధపడ్డారు కూడా. అలా కనిపించడానికి సమంత ఇంకా ఎక్కువ బాధపడింది.
Video Advertisement
ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపింది. ఎన్నో రోజులు శ్రమించింది. ఈ సిరీస్ లో ఉగ్రవాదం రోల్ లో నటించిన సమంత అలా కనిపించడం కోసమే మొరటు గా తయారైంది. ఆడవాళ్ళు ఉగ్రవాదం వైపుకు వస్తే ఎలా ఉంటారో సమంత అలానే కనిపించింది.
ఈ సిరీస్ షూట్ చేసాక.. కొన్ని సీన్ లు చెక్ చేసుకోవాలని సమంతని కోరగా.. తాను నటించిన సీన్లను చూసి.. సమంత ఎమోషనల్ అయ్యి క్యారవాన్ లోకి ఏడ్చుకుంటూ వెళ్లిపోయారట. కొంతసేపు క్యారవాన్ లోనే ఉండిపోయి నార్మల్ అయిన తరువాత మళ్ళీ బయటకు వచ్చి తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారట. ఈ రోల్ కోసం చాలా మందిని అనుకున్నామని.. కానీ సూపర్ డీలక్స్ లో సమంత నటన చూసి నచ్చి ఎంచుకున్నామన్నారు. ఈ రోల్ సమంత కోసమే రూపొందించినట్లుందన్నారు.
End of Article