Ads
వేసవికాలంలో ఎండలు తట్టుకోలేక మనం ఎక్కువగా పానీయాలను తీసుకుంటూ ఉంటాము. నీళ్ల తో పాటుగా ఎక్కువగా పండ్ల రసాలు వంటివి తీసుకుంటూ ఉంటాము. ఎండల వల్ల నీరసం కలగకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువగా తాగుతూ ఉండొచ్చు. అలానే చెరకు రసాన్ని కూడా ఎక్కువ మంది ఈ వేసవి లో తీసుకుంటూ ఉంటారు.
Video Advertisement
నిజానికి చెరుకు రసం తాగితే ఎండ నుంచి ఉపశమనం లభించి హాయిగా ఉంటుంది. చెరుకు రసం అప్పుడే ఫ్రెష్ గా తీసాక ఎండ వేళలో తాగుతూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీరు గమనించారా..?
చెరుకు రసాన్ని తీస్తున్న ప్రక్రియలో చెరకు మధ్యలో నిమ్మకాయని పెట్టి జ్యూస్ చేస్తారు. అయితే తియ్యగా చక్కగా ఉండే చెరుకు రసం లో నిమ్మకాయ ఎందుకు కలుపుతారు..?, నిమ్మకాయ వలన ఏదైనా ప్రయోజనం ఉంటుందా..? లేదంటే అందరూ అలానే చేస్తున్నారని ఈ తరంలో కూడా ఫాలో అవుతున్నారా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
చెరుకు రసాన్ని చేస్తున్న ప్రక్రియలో నిమ్మకాయ పెట్టడం వల్ల రెండు ప్రయోజనాలు మనం పొందొచ్చు. ఒకటి ఏంటంటే చెరుకురసం తీసేటప్పుడు చెరుకు మధ్య నిమ్మకాయ పెట్టి తీయడం వలన ఆ జ్యూస్ ని తాగితే మనకి పైత్యం చెయ్యదు. ఒకవేళ నిమ్మకాయ రసం లేదంటే పైత్యం చేస్తుంది. పచ్చి చెరుకురసం పైత్యం చేస్తుందని విరుగుడుగా నిమ్మకాయను పెడతారు.
అలానే ఆరోగ్యానికి హాని చేసే సూక్ష్మ క్రిములు చెరుకుగడలులో ఉంటాయి. ఇటువంటి వాటి వల్ల ఎలాంటి హాని కలగకూడదని నిమ్మరసాన్ని వేస్తారు. నిమ్మ రసం మనకి చెరుకు రసం వల్ల ఎలాంటి హానీ కలగకుండా ఉండేలా చేస్తుంది అందుకే చెరుకురసం తీసేటప్పుడు నిమ్మకాయని మిషన్ మధ్యలో పెట్టి జ్యూస్ తీయడం జరుగుతుంది.
End of Article