షర్ట్ బటన్స్ అబ్బాయిలకి కుడి వైపు… అమ్మాయిలకి ఎడమ వైపు ఎందుకు ఉంటాయి..?

షర్ట్ బటన్స్ అబ్బాయిలకి కుడి వైపు… అమ్మాయిలకి ఎడమ వైపు ఎందుకు ఉంటాయి..?

by Mohana Priya

Ads

ఎప్పుడైనా మీరు మీ చొక్కా బటన్ లో ఏ వైపుకు ఉన్నాయో గమనించారా. చాలావరకు మగవారు వేసుకుని దుస్తులకు బటన్ లో కుడివైపుకు ఉంటే ఆడవారు వేసుకునే దుస్తులకు ఎడమవైపుకు ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి అన్న అనుమానం చాలామందికి కలగదు ఎందుకంటే అసలు అది గమనించం కాబట్టి.

Video Advertisement

ఆడవారికి ఎడమ చేతి వాటం , మగవారికి కుడి చేతివాటం ఉంటుంది కాబట్టి అలా పెట్టారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రపంచంలో 90 శాతం మందికి పైన కుడి చేతివాటం కలిగి ఉంటారు.. పైగా చేతివాటానికి స్త్రీ పురుష భేదం ఉండదు. మరి ఇలా ఎందుకు ఉంది అంటే.. పూర్వం యూరోపియన్ మహిళలు దుస్తులు ధరించిన విధానాన్ని అనుసరించి ఇలా గుండీలు ఉండే విధానంలో మార్పులు వచ్చాయి.

shirt buttons

రీనేసన్స్ ( పునరుజ్జీవనోద్యమం) మరియు విక్టోరియా శకం లాంటి చారిత్రక కాలాలను మహిళలు దుస్తులు పురుషుల దుస్తులు కంటే ఎంతో భిన్నంగా మరియు క్లిష్టంగా ఉండేవి. పైగా అప్పటిలో విలాసవంతమైన దుస్తులు ధరించే అడవారు సంపన్నులై ఉండేవారు…కాబట్టి వారి దుస్తులను ఎక్కువగా పని వారు తొడగడంలో సహాయం చేసేవారు. వారికి అణువుగా ఉండడం కోసం బటన్స్ ఏడమ వైపుకు అమర్చబడేది.

shirt pocket 1

అలాగే అప్పటిలో మగవారు ఎక్కువగా సైన్యంలో పనిచేసేవారు. “ది ఆర్ట్ ఆఫ్ శైవల్రీ: యూరోపియన్ ఆర్మ్స్ అండ్ ఆర్మర్ ఫ్రమ్ ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ “రచయిత మగవారి బటన్స్ కుడి వైపు ఎందుకు ఉంటాయి అనే విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

shirt pocket 2

సైనికులు ఎక్కువగా ఆయుధాలను కుడి చేతితో వాడుతారు కాబట్టి దుస్తులకు బటన్లు కుడి వైపున నిర్మించడం వల్ల ఎడమ చేతితో అన్బటన్ చేయడం మరియు సర్దుబాటు చేయడం వంటివి సులభంగా చేయవచ్చు. అసలు ఇది ఎలా వచ్చింది అన్న విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఫ్యాషన్ కి అనుగుణంగా కుడియడమైన పర్వాలేదు అనే విధంగా అందరి దుస్తులు తారుమారుగా డిజైన్ చేయబడుతున్నాయి.


End of Article

You may also like