Ads
శివాజీ రాజా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమైన పేరే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో తనదైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. విలన్ గా, హీరో ఫ్రెండ్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ఈ నటుడు ఇటీవల సినిమాలు తగ్గించారనే చెప్పాలి.
Video Advertisement
కొన్ని సినిమాలో హీరోగా కూడా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శివాజీ రాజా పలు విషయాలను చెప్పుకొచ్చారు. “శ్రీ కనకమహాలక్ష్మి డాన్స్ ట్రూప్” సినిమాకు డైరెక్టర్ వంశి మొదట తనని హీరోగా అనుకున్నారని, తరువాత నరేష్ ను పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.
మొదటి నుంచి శివాజీ రాజాను హీరోగా పెట్టి సినిమా తీయాలని రంగనాథ్ గారు భావించేవారట. అందుకే మొగుడ్స్ పెళ్లామ్స్ అనే సినిమాను కూడా తీశారు. చిరు అభిమాని అయినప్పటికీ ఐదేళ్ళలో ఒక్క సినీ అవకాశం రాలేదన్నారు. కేవలం చిరు అభిమాని అయితే అవకాశాలు రావని అన్నారు. ఈ తరం వారికి తానిచ్చే సలహా అదేనని.. చిరు అభిమాని అని చెప్పడం వల్ల ఇతను వాళ్ళ మనిషి అనుకుని.. మిగతా వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారన్నారు.
మరోవైపు మెగాస్టార్ కుటుంబ సభ్యులు కూడా మనవాడే కదా అని పట్టించుకోలేదట. దీనితో జీవితం అటు ఇటూ కాకుండా పోయిందని.. ఈ విషయం తెలియడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఏ హీరోతోనూ నటించే అవకాశం రాలేదని, ఇప్పుడు అడిగినా నటించే ఓపిక లేదని చెప్పుకొచ్చారు. ఇతర హీరోలతో మాత్రం చాలా సినిమాల్లో నటించాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
End of Article