Ads
హిందువులు జరుపుకునే పండుగలలో తొలి పండుగ ఉగాది. తెలుగు పండుగలు ఉగాదితోనే మొదలు అవుతాయని విశ్వసిస్తారు. ఈ ఉగాదిని తెలుగుదనం ఉట్టిపడేలా జరుపుకుంటారు. ఈ పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలలో జరుపుకుంటారు. ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు.
Video Advertisement
తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో ఈ పండుగను ఉగాది పేరుతోనే అందరు జరుపుకుంటారు. గుడి పడ్వా గా మహారాష్ట్రలో, విషు అని కేరళలో, పుత్తాండు అని తమిళనాడులో, పోయ్ లా బైశాఖ్ అని బెంగాలీలు, సిక్కులు వైశాఖి అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది అనగా ఉగ అంటే నక్షత్ర గమనం అని, ఆది అంటే ప్రారంభం అని అర్థం. ఉగాది అనగా సృష్టి, నక్షత్ర గమనం ప్రారంభం అయిన తొలి రోజు. జనవరి ఫస్ట్ ని పాశ్చాత్తులు నూతన సంవత్సరంగా భావిస్తారు. తెలుగువారికి ఉగాది రోజునే నూతన సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు.
సాధారణంగా ఉగాది, దీపావళి వంటి పండుగల రోజున నూనెతో స్నానం చేయడం అనేది హిందూవులకి ఆచారంగా వస్తోంది. అయితే నూనె స్నానం ఆచరించడం వల్ల ఉపయోగం ఏమిటో? నూనె స్నానం ఉగాది రోజున ఎందుకు చేస్తారో ఇప్పుడు చూద్దాం..
ప్రతి రోజూ స్నానం చేస్తుంటాం. కానీ ఉగాది రోజున ప్రత్యేకంగా నూనెతో స్నానం చేస్తారు. నూనె చర్మానికి రాసుకుని స్నానం చేసినట్లయితే వారిలో ఆధ్యాత్మిక స్పృహ కలుగుతుందని చెప్తారు. అంతే కాకుండా తేజస్సు పెరుగుతుంది.
ప్రతికూలతను పోగొడుతుంది. నూనె స్నానం చేయడం వల్ల ఆ వ్యక్తి శరీరంలోని నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. తద్వారా సానుకూల అనుభూతిని కలుగుతుంది. నూనె రాసుకున్న తరువాత వేడి నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం పై రక్షణ పొర ఏర్పడుతుందంట.నూనె స్నానం సమయంలో, శరీరంలోకి దైవిక ప్రవాహం ఆకర్షించబడుతుందని, శరీరంలో ఆ తరంగాలు ఉత్పన్నమవుతాయని నమ్ముతారు. నూనె స్నానం వల్ల జీవశక్తి శరీరంలో పెరుగుతుంది. దాంతో మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు.
Also Read: అసలు “శకుంతల” ఎవరు..? ఈ 3 కథల్లో ఏది నిజం..? ఏది కల్పితం..?
End of Article