Ads
ప్రపంచంలో దాదాపు 90 శాతం మంది ఆడవాళ్లు ఇష్టపడేది నగలు. అవి సింపుల్ వి అయినా కావచ్చు లేదా హెవీ అయినా కావచ్చు చాలా మందికి ఏదో ఒక ఆభరణం అంటే ఇష్టం ఉండి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశ స్త్రీలకి. నగలు పెట్టుకోవడానికి కారణం అలంకారం అని అనుకుంటాం. కానీ కాదు. ప్రతి ఆభరణం పెట్టుకోవడం వెనక ఆరోగ్యానికి సంబంధించిన కారణాలు ఉన్నాయి.
Video Advertisement
కాళ్ల నీ మడమ ని కలిపే భాగంలో పట్టీలు పెట్టుకుంటారు. సాధారణంగా పట్టీలు వెండితో తయారు చేస్తారు ఎందుకంటే వెండి తో భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అందువల్ల భూమి నుండి పాజిటివ్ ఎనర్జీ బయటికి వస్తుంది. అంతేకాకుండా పట్టీలు పెట్టుకోవడం వల్ల కీళ్ల నొప్పులు రావట. పట్టీల శబ్దం వల్ల చెడు శక్తులు దూరంగా ఉంటాయి అని అంటారు. అందుకే బంగారం ఇతర మెటీరియల్స్ తో కాకుండా వెండితో తయారుచేసిన పట్టీలు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు పెద్దలు.
వెండి శరీరానికి చలవ చేస్తుంది వెండి వస్తువులని పెట్టుకోవడం వలన శరీరం లో ఉన్న వేడి బయటకు వెళ్ళి పోతుంది. అందుకే బంగారం కంటే వెండి పట్టీలు పెట్టుకుంటారు.అయితే కొంతమందికి బంగారు పట్టీలు పెట్టుకోవచ్చా అని సందేహముంటుంది. లక్ష్మీ దేవి కి పసుపు రంగు చాలా ఇష్టం. బంగారం కూడా ఇదే రంగులో ఉంటుంది బంగారంతో చేసిన వేటినైనా కూడా కాళ్ళకి పెట్టుకోవడం మంచిది కాదు. అందుకని మనం పెద్దలు చెప్పిన మాటలను వింటూ ఉండాలి అలానే పూర్వికులు పెట్టిన ఆచారాలను పాటిస్తూ ఉండాలి.
End of Article