కెరీర్ పీక్స్ లో ఉండగా…ఆ నాలుగేళ్లు “స్నేహ” సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం ఇదే.!

కెరీర్ పీక్స్ లో ఉండగా…ఆ నాలుగేళ్లు “స్నేహ” సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం ఇదే.!

by Mohana Priya

Ads

ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి, ఇప్పుడు కూడా హీరోయిన్ తో పాటు ఎన్నో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు స్నేహ. స్నేహ అసలు పేరు సుహాసిని రాజా రత్నం నాయుడు. స్నేహ ముంబై లో పుట్టారు.

Video Advertisement

స్నేహ పుట్టిన తర్వాత తన కుటుంబం మొత్తం షార్జా కి వెళ్లిపోయారు. తర్వాత తమిళనాడులోని పనృతి లో సెటిల్ అయ్యారు. స్నేహా వాళ్ళ కుటుంబానికి చెన్నై కుంభకోణం (తంజావూర్) హైవే దగ్గర స్నేహ మహల్ అనే ఫంక్షన్ హాల్ కూడా ఉండేదట.

2000 సంవత్సరంలో ఒక మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు స్నేహ. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఒక తమిళ్ సినిమా కూడా చేశారు. 2001లో వచ్చిన తొలివలపు సినిమా తెలుగు ఇండస్ట్రీలో స్నేహ మొదటి సినిమా.

ఆ తర్వాత తెలుగులో ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, శ్రీరామదాసు, మహారధి, రాధాగోపాళం, దట్ ఈజ్ పాండు, ఏమండోయ్ శ్రీవారు, మనసు పలికే మౌన రాగం, మధుమాసం, రాజన్న తో పాటు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు.

 

2011 లో రాజన్న సినిమా లో నటించిన స్నేహ, తర్వాత నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని సన్నాఫ్ సత్యమూర్తి తో తెలుగు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో కొన్ని తమిళ్ సినిమాలు, ఒక కన్నడ చిత్రం చేశారు. మళ్లీ  తెలుగు లో దాదాపు నాలుగేళ్ల తర్వాత వినయ విధేయ రామ లో నటించారు స్నేహ.

రాజన్న కి సన్నాఫ్ సత్యమూర్తి కి మధ్యలో కొన్ని తమిళ సినిమాలు చేసినా కూడా కొంచెం విరామం తీసుకున్నారు స్నేహ. దానికి కారణం 2012లో స్నేహ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

2015 లో వారిద్దరికీ ఒక బాబు పుట్టాడు. బాబు పేరు విహాన్. కొంతకాలం క్రితం మళ్లీ విరామం తీసుకున్నారు స్నేహ. ఆగస్టు 2019 లో తన ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు. 2020 లో ధనుష్ హీరోగా వచ్చిన పటాస్ (తెలుగు లోకల్ బాయ్) సినిమా లో డబుల్ రోల్ చేసిన ధనుష్ లో ఒక ధనుష్ పాత్ర కి జోడీగా నటించారు స్నేహ.

ఈ సంవత్సరం జనవరి 24 వ తేదీన స్నేహ కి పాప పుట్టింది. పాపకి ఆద్యంత అని పేరు పెట్టారు. ప్రస్తుతం స్నేహ తర్వాతి ప్రాజెక్ట్ వాన్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో స్నేహ తో పాటు, ప్రియా భవాని శంకర్, కృతి కర్బంద, కళ్యాణి ప్రియదర్శన్ కూడా నటిస్తున్నారు.


End of Article

You may also like