4 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన “కొరటాల శివ” పై… ఒక్క సినిమాకే ఇంత నెగిటివిటీ ఎందుకు..?

4 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన “కొరటాల శివ” పై… ఒక్క సినిమాకే ఇంత నెగిటివిటీ ఎందుకు..?

by Anudeep

Ads

మొన్నటి వరకు అపజయం ఎవరుగని స్టార్ డైరెక్టర్ గా కొనసాగాడు కొరటాల శివ. టాలీవుడ్ టాప్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించాడు కొరటాల. మొదట కొరటాల శివ పోసాని వద్ద అసిస్టెంట్ గా చేరి తన రచనతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత సోలో రైటర్ గా చేశారు. “భద్ర, ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, సింహా, ఊసరవెల్లి” వంటి చిత్రాలకు రచనలో సహాకారం అందించారు.

Video Advertisement

అయితే సింహా టైం లో కొరటాల రావాల్సిన క్రెడిట్ రాకపోవడంతో సొంతంగా సినిమా ప్లాన్ చేసుకున్నాడు శివ.. అదే మిర్చి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి ప్లాన్ చేసాడు ఆ కథ విని ప్రభాస్ కూడా రాజమౌళిని ఒప్పించి మిర్చి పూర్తి చేసే బాహుబలి ప్రారంభించాడు. అలా ‘మిర్చి’తో కొరటాల శివ దర్శకునిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

‘మిర్చి’ బ్లాక్ బాస్టర్ తో కొరటాల శివతో కలసి పనిచేసేందుకు టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా క్యూ కట్టారు. అలా రెండో సినిమాతోనే మహేశ్ లాంటి టాప్ స్టార్ తో పనిచేసే అవకాశం దక్కింది. మహేశ్ తో కొరటాల తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ కూడా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’తోనూ మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలా హ్యాట్రిక్ సక్సెస్ చూసిన కొరటాల నాల్గవ చిత్రంగా మళ్లీ మహేష్ తో ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని తెరకెక్కించారు.

వరుసగా నాలుగు విజయాలు సొంతం చేసుకున్న కొరటాలకు ఐదో చిత్రంతో మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’గా మలిచే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కలసి నటించినా, బాక్సాఫీస్ ఫలితం నిరాశ కలిగించింది. నాలుగు భారీ విజయాల తరువాత కొరటాల శివకు ‘ఆచార్య’ అసంతృప్తి మిగిల్చింది. జయాపజయాలు ఎవరికైనా తప్పవు. కానీ టాప్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ ఒక్క ఫ్లాప్ సినిమా తీయగానే అందరూ అతన్ని టార్గెట్ చేసి విమర్శించడం ప్రారంభించారు. కథ, డైరెక్షన్ పక్కన పెట్టి బిసినెస్ పై దృష్టి పెట్టాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఎంతో కాలంగా హిట్లు లేని ప్రభాస్, జూనియర్, మహేష్ లకు సూపర్ హిట్లు ఇచ్చిన శివ.. మెగాస్టార్ ఆచార్యతో కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ సినిమా ఫ్లాప్ తో మెగాస్టార్ కు వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే మెగాస్టార్ చూడని హిట్లంటూ ఏం లేవు. అలాగే శివ కూడా ఇప్పటి వరకూ ఫ్లాప్ ఎరుగని డైరెక్టర్ గానే ఉన్నాడు. కానీ ఒక్క సినిమాలో అతని అంచనాలు తారుమారు అయ్యాయి అది సహజం కూడా కానీ ఈ సినిమాతో మాకు నష్టం వచ్చిందని డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీస్ కు వచ్చి పరువు తీయడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఆచార్య కూడా సూపర్ హిట్ అయితే మాత్రం వాళ్ళు లాభాలు వచ్చాయని ఆఫీస్ కి వచ్చి షేర్ ఇచ్చే వారా.. మరి నష్టలొస్తే ఇలా ప్రవర్తించడం ఏంటీ..!?

బిజినెస్ అన్నాక లాభాలూ, నష్టాలు రెండూ ఉంటాయి. దానికి ఒక డైరెక్టర్ ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆచార్య సమస్యలు వీడితే కానీ కొరటాల ప్రశాంతగా ఇంకో సినిమా తీయలేడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఓ చిత్రం చేయనున్నాడు. ‘జనతా గ్యారేజ్’ లాగా ఈ సినిమాను కూడా సక్సెస్ బాటలో పయనింపజేస్తే కొరటాల శివ మరోమారు తన సత్తా చాటుకున్నట్టవుతుంది.


End of Article

You may also like