Ads
నిద్ర సుఖమెరుగదు అంటుంటారు కానీ.. కొంచమైనా సుఖం గా నిద్రపట్టకపోతే తెల్లారి పనులన్నీ అన్యమస్కం గా చేస్తుంటాము. ఆరోగ్యకరం గా పనులు చక్కదిద్దుకోవాలంటే.. ముందు రోజు రాత్రి హాయిగా నిద్రపోవాలి. చాలా మంది కలత నిద్రపోతూ ఉంటారు. పడుకున్నట్లే ఉంటారు కానీ.. గాఢం గా నిద్రపోలేరు. ఫలితం గా రోజంతా అలసటను ఫీల్ అవుతూ ఉంటారు.
Video Advertisement
మరికొందరు అటూ..ఇటూ దొర్లుతూ నిద్రపోతుంటారు. వీరిలో చాలా మందికి నిద్ర మధ్యలోనే మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. పోనీ పైకి లేచి కూర్చుందాం అంటే వీరి వల్ల కాదు. పైన ఏదో బరువు ఉన్నట్లు..అస్సలు కదలలేకపోతారు. శరీరం అస్సలు సహకరించదు. ఇలా జరుగుతూ ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కారణం ఏంటంటే అనారోగ్య సమస్యలు. మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నవారికి సరిగ్గా నిద్ర పట్టక ఇలా ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది.
నిజానికి మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు.. శరీరం మేలుకునే ఉంటుంది. శరీర భాగాలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే.. ఆ సమయం పరిష్కరించుకుంటుంది. ఆ టైం లో ఉన్నట్లుండి శరీర ఉష్ణోగ్రత పెరగడం, లేదా బిపి పెరగడం వంటివి జరిగితే.. ఇలా శరీరం కదలలేని స్థితి లోకి వెళ్ళిపోతుంది.
మూడవ కారణం ఏమిటంటే.. స్లీప్ పారలైసిస్. నిద్రలో ఉన్నప్పుడు భయం ఎక్కువైతే.. ఛాతి పైన ఏదో ఉన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఈ భయం కారణంగా ఎవరు లేకపోయినా.. ఎవరో ఉన్నారని ఊహించేసుకుని మరింత భయాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇలా అనుకునేవారికి కూడా శరీరం బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. కొంతమందికి శరీరం గాలిలో తేలిపోతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ సమస్య నుంచి బయటపడడం పెద్ద కష్టమేమీ కాదు. వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, సరిపడా నిద్ర.. వంటివి నిక్కచ్చి గా పాటిస్తే ఇలాంటి ఇబ్బందులు దరిచేరవు.
End of Article