ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న ఒకే ఒక విషయం చంద్రయాన్-3. ఎన్నో సంవత్సరాలు కష్టపడి భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ ఘనతని సాధించారు. ప్రస్తుతం చంద్రయాన్ – 3 చంద్రుడి మీద ల్యాండ్ అయ్యింది.

Video Advertisement

చంద్రుడి మీదకి వెళ్లాక అక్కడ తీసిన ఫోటోలు కూడా విడుదల చేశారు. భారతదేశంలో ఎంతో మంది సినీ, రాజకీయ ఇంకా ఇతర రంగానికి చెందిన ప్రముఖులు అందరూ కూడా ఈ విషయంపై అభినందనలు తెలుపుతున్నారు.

సోషల్ మీడియా అంతా చంద్రయాన్ గురించి పోస్ట్ లతోనే నిండిపోయింది. ఈ మిషన్ లో కృషి చేసిన ఎంతో మంది శాస్త్రవేత్తలకి కూడా అభినందనలు తెలుపుతూ, వారు చేసిన ఈ పనిని ప్రశంసిస్తున్నారు. అయితే, సాధారణంగా చంద్రుని మీద సౌత్ పోల్ అంటే దక్షిణ ధ్రువం అనేది చాలా ముఖ్యమైనది అని అంటారు. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నీళ్లు అనేవి అంతరిక్షంలో ఒక ఇంధనం లాగా, వ్యోమగాములకి ఆక్సిజన్ లాగా పని చేస్తాయి.

లూనార్ వాటర్ చంద్రుడి మీద ఉంటాయి. ఈ లూనార్ వాటర్ ని అంతరిక్షంలో ఒక చోట నుండి మరొక చోటకి పంపించవచ్చు. దీనికి అంత పవర్ ఉంది. చంద్రుడికి ఉన్న దక్షిణ ధృవంలో ఉండే క్రేటర్స్ కి నీడ ఎక్కువగా ఉండడంతో ఆ నీళ్లు ఆవిరి అవ్వకుండా, అలాగే ఇతర ద్రవాలు అందులో కలవకుండా అవి కాపాడతాయి.

ఈ క్రేటర్స్ లో లూనార్ వాటర్ ఉంటాయని, అంతే కాకుండా లూనార్ మైనింగ్ కార్యకలాపాలు చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి అని అంటారు. నీళ్లు మాత్రమే కాకుండా దక్షిణ ధ్రువంలో కొన్ని ముఖ్యమైన ఖనిజాలు, లోహాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా ఈ ధ్రువంలో పరిశోధనలు చేస్తే అది ఇంకా కొత్త విషయాలని కనుగొనడానికి సహాయం చేస్తుంది. కాబట్టి చంద్రుడి మీద దక్షిణ ధ్రువం అనేది చాలా ముఖ్యమైనది అని అంటారు.

ALSO READ : చంద్రయాన్-3 సక్సెస్ అవ్వడం వల్ల భారతదేశానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటో తెలుసా..?