1941 లోనే బయో ప్లాస్టిక్ తో తయారైన ఆ ఒక్క కారును ఎందుకు ధ్వంసం చేసారు.? ఆ ఫార్ములా ఇప్పుడు ఉండి ఉంటే.?

1941 లోనే బయో ప్లాస్టిక్ తో తయారైన ఆ ఒక్క కారును ఎందుకు ధ్వంసం చేసారు.? ఆ ఫార్ములా ఇప్పుడు ఉండి ఉంటే.?

by Megha Varna

Ads

“ఫోర్డ్ సోయాబీన్ కారు”.. రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ముందు ఓ సంచలనం. ఈ కారుని హెన్రీ ఫోర్డ్ డిజైన్ చేసారు. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. దీనిని బయో ప్లాస్టిక్ తో తయారు చేసారు. ఇది స్టీల్, ప్లాస్టిక్ కంటే సమర్ధవంతంగా ఉంటుంది. దీని బరువు తక్కువ. దీని తయారీకి అయ్యే ఖర్చు కూడా తక్కువే.

Video Advertisement

కానీ.. ఇలాంటి కారుని ఒక్కదానినే తయారు చేసినా ఆ తయారు చేసిన కారుని కూడా ధ్వంసం చేసేసారు. అయితే.. ఈ ఫోర్డ్ సోయాబీన్ కారుని ఎందుకు ఎక్కువగా తయారు చేయలేకపోయారు..? చేసిన ఒక్క కారుని ఎందుకు ధ్వంసం చేసేసారు..? అనేది ఇప్పుడు చూద్దాం.

ford 4

బయో ప్లాస్టిక్ ను తయారు చేసి.. ఆ మెటీరియల్ తో కారుని తయారు చేసిన మొట్ట మొదటి వ్యక్తి ఫోర్డ్. ప్రస్తుతం నడుస్తున్న కార్లు, మోటార్ బైక్ వాహనాల వలన వచ్చే కార్బన్ డై ఆక్సయిడ్ వాతావరణ కాలుష్యానికి కారణంగా భావిస్తున్నారు. కానీ, ఫోర్డ్ వంద సంవత్సరాలకు క్రితమే దీనిని గుర్తించి బయో డిగ్రేడబుల్ కార్ ను తయారు చేయాలనుకున్నారు. అందుకోసమే బయో ప్లాస్టిక్ మెటీరియల్ ను తయారు చేసారు. ఈ మెటీరియల్ స్టీల్, ప్లాస్టిక్ కంటే పది రెట్లు బలంగా ఉంటుంది.

ford 2

ఎక్కువగా జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని బయో ప్లాస్టిక్ మెటీరియల్ తో కార్ ని తయారు చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే బయో ప్లాస్టిక్ తో కార్ తయారు చేసారు. 1930 ల కాలంలోనే ఫోర్డ్ బయోప్లాస్టిక్‌లను ఉత్పత్తి చేయడం, ఉపయోగించడంలో మొదటి స్థానంలో ఉంది. ఈ బయో ప్లాస్టిక్ ను మొక్కలు, హైడ్రో కార్బన్ల నుంచి తయారు చేస్తారు. ఈ మెటీరియల్ తో తయారు చేసిన కార్ కు ‘సోయాబీన్ కారు’ / ‘సోయాబీన్ ఆటో’ అని నామకరణం చేసారు.

ford 3

1941 లో ఈ కారు ప్రజల ముందుకు వచ్చింది. ఆయన తయారు చేసిన మెటీరియల్ ప్యానెల్ పటిష్టమైనదని తెలిపారు. అంతేకాదు.. గొడ్డలి తో కొట్టి మరీ చూపించగా.. కేవలం సొట్టలు మాత్రమే పడ్డాయి. ఈ మెటీరియల్ తో హెన్రీ ఫోర్డ్ పదివేల విడి కార్ల విభాగాలను తయారు చేయాలని అనుకున్నారు. కానీ అలా చేయలేకపోయారు. సరికదా.. ఆయన తయారు చేసిన ఒకే ఒక్క కారుని కూడా ధ్వంసం చేసేసారు.

ford 1

దీనికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం. ఈ యుద్ధం లో అమెరికా ప్రమేయం కూడా ఉంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ పైన ప్రభుత్వం ఆసక్తి కనబరచలేదు. దీనితో బయో ప్లాస్టిక్ తో కారు చేయాలనే ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరో వైపు యుద్ధం అయిపోయాక కూడా దేశ అభివృద్ధి, ఇతర కార్యకలాపాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనితో ఈ కారు తయారు చెయ్యాలనే ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మరోవైపు ఆ సమయంలో చమురు కూడా చవకగా లభిస్తుండడంతో మామూలు కార్లే ఆర్ధికంగా గా అనువుగా ఉన్నాయని భావించేవారు. పర్యావరణం గురించి ఆలోచన తక్కువ ఉండడం, చమురు చవకగా దొరుకుతుండడం కూడా ఈ సోయాబీన్ కార్ల నిర్మాణం వెనకబడడానికి కారణం.

ford 5

మరో కారణం ఏంటంటే.. ఈ కారు దేనితో తయారు చేస్తారు అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎటువంటి ఫలితాలను ఇవ్వకపోవడంతో ఒక మోడల్ ని మాత్రమే ఉత్పత్తి చేసారు. ప్రోగ్రెస్ లేకపోవడంతో.. ఆ కార్ ని కూడా ధ్వంసం చేసేసారు. అందుకే ఇప్పటికైనా.. వాటిని తయారు చేద్దాం అన్నా వీలు లేదు. ఎందుకంటే ఈ కార్ తయారీ కి సంబంధించిన ఫార్ములా ఏదీ అందుబాటులో లేదు. ప్యానెల్ కోసం ఏ పదార్థాలు వాడారు అనేది తెలియలేదు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఫోర్డ్ రసాయన శాస్త్రవేత్తలు ప్లాస్టిక్‌ను తయారు చేయడానికి 70 శాతం సెల్యులోజ్, 30 శాతం రెసిన్ బైండర్‌ను వాడారని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం తెలుస్తోంది.  సెల్యులోజ్ ఫైబర్‌లో 50% దేవదారు ఫైబర్, 30% గడ్డి, 10% గంజాయి, 10% రెమీ వాడారని తెలుస్తోంది. కచ్చితమైన వివరాలు లేకపోవడం వల్ల ఈ కారుని నిర్మించడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు.

 

 


End of Article

You may also like