వారి గురించి ఎందుకలా రాస్తున్నారు.? ఈ యాంగిల్ లో ఒకసారి ఆలోచించండి.!

వారి గురించి ఎందుకలా రాస్తున్నారు.? ఈ యాంగిల్ లో ఒకసారి ఆలోచించండి.!

by Anudeep

Ads

ప్రముఖ సింగర్లుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రావణ భార్గవి, హేమచంద్ర “సూపర్ సింగర్” కార్యక్రమం ద్వారా పరిచయమై అనంతరం ప్రేమలో పడ్డారు. ఈ జంట పెద్దలను ఒప్పించి 2013 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉన్న సంగతి తెలిసిందే.

Video Advertisement

అయితే గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారు అని అందుకే విడివిడిగా ఉంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి ఒక ఫ్రెండ్ కారణమని తెలుస్తోంది.

వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయినటువంటి మరొక సింగర్ తో హేమచంద్ర చనువుగా ఉండటమే కాకుండా ఆమెతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో క్లిప్ విన్న శ్రావణ భార్గవి హేమచంద్రకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారనీ తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయంతో ఇప్పటికే విడిగా ఉంటున్నారని తెలుస్తుంది అంటూ సోషల్ మీడియా తో పాటు అనే వెబ్సైట్లలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో ఎవరికీ  తెలీదు కానీ సెలబ్రెటీలను, స్టార్ సెలబ్రెటీలను టార్గెట్ చేసి కొందరు ఇలాంటి వార్తలు అల్లుతూ శునకానందం పొందుతూ ఉంటారు.


ఒకవేళ వాళ్ళు నిజంగా విడిపోవాలి అనుకుంటే.. ఆఫీషల్ గా ట్విట్టర్ లేదా ఇంస్టాగ్రామ్  లో చెప్పే వరకు ఆగొచ్చు కదా.. ప్రేమ, పెళ్ళి, విడాకులు అనేవి వారి వ్యక్తిగత విషయాలు కదా వాటిల్లోకి మనం దూరి వాళ్ళ జీవితాల్ని జడ్జ్ చేయడం ఎందుకు..? ఆయనకు పలానా  వారితో సంబంధం ఉంది, వీళ్ళు విడిపోతున్నారంటా అని రాయడానికి మీకూ , చదవడానికి జనాలకూ  ఆనందంగానే ఉండొచ్చు కానీ ఇలాంటి విషయాలు వారి ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని, పిల్లల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. ఒక రకంగా ఇలాంటి రాతల ద్వారా వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతారు.

బయకు వెళ్తే ఎవరో ఒకరు ఇవే ప్రశ్నిస్తారని సామాజిక దూరం పాటిస్తారు. ఒకలాంటి డిప్రెషన్ కి గురవుతారు వాళ్ళు. నిజానికి వాళ్ళు కలిసి ఉన్నా, విడిపోయినా మనకేం నష్టం ఉండదు కానీ ఇలాంటి పనికి రాని వార్తల వలన పచ్చని జీవితంలో చిచ్చు పెట్టినట్టు అవుతుంది . ఏదిఏమైనా వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు సోషల్ మీడియా, ఇతర వెబ్ సైట్స్  సంయమనం పాటించడం మంచిది.


End of Article

You may also like