సినిమాలలో పౌరాణికం ప్రాధాన్యత ఉన్న సినిమాలు మరింత ప్రత్యేకమైనవి. అలాంటి సినిమాలలో మన హీరోలు పౌరాణిక పాత్రలలో కనిపిస్తే చూసి మురిసిపోయే అభిమానులకు కొదవేమీ లేదు. అయితే.. అలనాటి చిత్రాలలో మన స్టార్ హీరోలలో కొంతమంది శివుడి పాత్రలలో నటించి మెప్పించారు.

Video Advertisement

ఇతర నటులలో కూడా కొందరు శివుడి వేషధారణలు వేసిన వారు ఉన్నారు. కానీ.. స్టార్ హీరోలు నటించిన పాత్రలు మాత్రం బాగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే.. ఈ స్టార్ హీరోలు శివుడి పాత్రను నటించినప్పుడు మెడలో నిజమైన పాముని వేసుకోరు.

shiva getup

అయితే, ఒకప్పుడు కొన్ని పాత భక్తి రసాత్మక సినిమాలలో నాగుపాముని తెచ్చి షూటింగ్ జరిపేవారు. కానీ శివుడి వేషధారణ వేసిన స్టార్ హీరోలు నాగుపాముకి బదులుగా మెటల్ తో తయారు చేసిన నాగుపాము ఆభరణాన్ని ధరించి నటించారు. ఇలా ఎందుకు చేసారో ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష యజ్ఞం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ సినిమాలలో ఎన్టీఆర్ శివుడిగా నటించినప్పటికీ.. మెడలో పాముని ధరించలేదు. ఇక శ్రీమంజునాథ సినిమాలో కూడా చిరు శివుడిగా నటించారు.

shiva getup 1

కానీ లోహపు ఆభరణాన్ని ధరించారు తప్ప నిజమైన పాముని మెడలో వేసుకోలేదు. షూటింగ్ జరిగే సమయాల్లో పాము వలన షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. అదీ కాకుండా.. జంతువులను సినిమాలలో నటింప చేయాలంటే కచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. అసలు పాము వల్ల వచ్చే కష్టాలేంటో కమల్ హాసన్ నటించిన బ్రహ్మచారి సినిమాలో చూపించారు. ఈ ఇబ్బందులు ఉంటాయి కాబట్టే నిజమైన పాముని కాకుండా లోహపు వస్తువులను ఉపయోగించి షూటింగ్ పూర్తి చేస్తుంటారు.