ఈ ఫోటోలో కుడి వైపు ఉన్న మహిళను గమనించారా.? ఆమె చీర‌ ఎత్తి మ‌రీ చేతిని ఎందుకు చూపిస్తుందో తెలుసా.?

ఈ ఫోటోలో కుడి వైపు ఉన్న మహిళను గమనించారా.? ఆమె చీర‌ ఎత్తి మ‌రీ చేతిని ఎందుకు చూపిస్తుందో తెలుసా.?

by Anudeep

ఈ కింద ఉన్న పెయింటింగ్ ను ఒకసారి జాగ్రత్త గా గమనించి చూడండి.. ఒక ముగ్గురు రాజవంశ కాలం నాటి స్త్రీలు అందం గా పోజ్ ఇచ్చారు కదా.. అయితే.. ఈ ఫోటో చూడగానే ముందు మనకి కలిగే సందేహం ఏమిటంటే.. ఆ ముగ్గురు స్త్రీలలో ఒక మహిళ ఎందుకు తన చీరను ఎత్తి చూపిస్తోంది..? అనే కదా.. ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.

Video Advertisement

british 1

మాములుగా ఫోటో తీసేటప్పుడు అలా జరిగితే సర్దిచెప్పుకోవచ్చు.. కానీ.. పెయింటింగ్ లో ఇలా జరిగింది. నిజానికి ఈ ఫోటో వెనక పెద్ద సందేశమే దాగి ఉంది. పందొమ్మిదవ శతాబ్దం కాలం లో ఇండియా లో మసూచి మహమ్మారి చాలా వేగం గా వ్యాప్తి చెందుతోంది. మనుషులు అల్లాడిపోతున్నారు. ఆ సమయం లో మైసూర్ ని బ్రిటిష్ ఇండియా పాలిస్తోంది.

masuchi

అప్పటి మైసూర్ రాజ్యాన్ని పాలిస్తున్న మార్క్ విల్కేస్ ప్రజలను బ్రిటిష్ వారి వాక్సిన్ ను వేయించుకోవాల్సింది గా కోరారు. అయితే.. అప్పట్లో కూడా రూమర్లు ఎక్కువ గానే ఉండేవి. బ్రిటిష్ వారి వాక్సిన్ ప్రాణాలకే ముప్పు తెస్తుందని అప్పటి ప్రజలు భావించేవారు. చాలా మంది టీకా వేయించుకోవడానికి జంకేవారు. అప్పటికే మైసూర్ యువరాజు కు ఈ పై ఫొటోలో కుడివైపున ఉన్న దేవజమణి యువరాణితో వివాహం నిశ్చయమైంది.

masuchi 2

ఆమె మైసూర్ యువరాజ కు కాబోయే భార్య. ఆ సమయం లోనే.. ఆమె వాక్సిన్ ను వేయించుకుని.. ఈ పెయింటింగ్ ను వేయించి అందరిని వాక్సిన్ వేయించుకోవాలంటూ కోరారు. ఈ పెయింటింగ్ ద్వారా తానూ టీకా వేయించుకున్నానని తెలియచెప్పారు. ఈ రాజ్యం రాజుకు కాబోయే భార్య ధైర్యం గా టీకా వేయించుకున్నారని.. ప్రజలు కూడా ముందుకు వచ్చి వాక్సిన్ ను వేయించుకోవాలని చెప్పడం కోసమే ఈ పెయింటింగ్ ను ఇలా చిత్రీకరించారు.


You may also like