నాని దసరా సినిమా థియేటర్ లోకి వచ్చేసింది. గత కొంతకాలంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా చిత్రం గా వచ్చిన ఈ మూవీ కి పాజిటివ్ టాక్ వస్తోంది. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా సినిమాను అనుకున్న రేంజ్ లో తెరకెక్కించడం లో సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు నానిని కేవలం ఒక యాంగిల్ లో మాత్రమే చూశాం కానీ నానిలో చాలా విషయం ఉంది అనిపించేలా చేశాడని ఫాన్స్ అనుకుంటున్నారు.

Video Advertisement

అయితే ఈ సినిమా విషయంలో సినీ ప్రియులందరికీ ఒక సందేహం మాత్రం ఉండిపోయింది. దసరా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇప్పటివరకు ఎక్కడా చూసినా సిల్క్ స్మిత పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఓ గోడపై సిల్క్ స్మిత పోస్టర్ ఉండగా.. అక్కడే ఉన్న అరుగుపై నాని కూర్చొని ఉన్న పోస్టర్ తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో నానితోపాటు.. ఇతర యూనిట్ సభ్యులు ధరించిన డ్రెస్ లపై దసరా టైటిల్ తోపాటు.. సిల్క్ స్మిత ఫోటో కనిపిస్తోంది.

why there is silk smitha poster in dasara movie..!!

ఈ విషయం గురించి నాని ని అడగ్గా..సిల్క్ స్మిత పోస్టర్ పెట్టడానికి కారణం కేవలం దర్శకుడికి మాత్రమే తెలుసంటూ చెప్పుకొచ్చారు. తాజాగా ఇదే విషయం పై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. “చిన్నప్పుడు సింగరేణి గనుల్లో మా తాత పనిచేస్తున్న సమయంలో ఆయన కాలు విరిగింది. ఆయన కోసం ప్రతిరోజు కల్లు తీసుకుని వస్తూ ఉండేవాడిని. కల్లు దుకాణం దగ్గర మొదటి సారి సిల్క్ స్మిత పోస్టర్ చూశాను. అప్పటికే ఆమె ఒక స్పెషల్ హీరోయిన్. స్పెషల్ క్యారెక్టర్, సాంగ్స్ చేస్తుందని తెలియదు. కానీ ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకుంటున్న సమయంలో ఆమె ఫోటో నా మనసులో క్లిక్ అయ్యింది. సినిమా అంటే ఆమెకు ఎంత ఇష్టమో తెలిసింది.

why there is silk smitha poster in dasara movie..!!

చిన్ననాటి కల్లు దుకాణం జ్ఞాపకాలు సినిమాలో కొన్ని పెట్టే అవకాశం వచ్చింది. అందుకే సిల్క్ స్మిత పోస్టర్ ఉపయోగించాను. సినిమాలో సిల్క్ స్మిత లేకున్నా.. ఆమెకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇక దసరా మూవీ లో మొదటి నుంచి సిల్క్ స్మిత పోస్టర్ హైలెట్ అవుతూ వచ్చింది. సినిమా లో సిల్క్ బార్ దగ్గరే కథ నడుస్తుంది. ఎక్కువ సన్నివేశాలు కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.