ఎర్ర చందనానికి అంత డిమాండ్ ఎందుకు? అసలు కారణం ఇదే..!

ఎర్ర చందనానికి అంత డిమాండ్ ఎందుకు? అసలు కారణం ఇదే..!

by Sunku Sravan

Ads

ఎర్ర చందనానికి ఎందుకు అంత డిమాండ్ ఉంటుంది దాన్ని ఎందుకు వాడతారో తెలుసా? ఎర్రచందనం పుష్ప సినిమా రిలీజ్ అయ్యాక దాని మీదే అందరి చూపు పడింది. కానీ సినిమా చూశాక అందరికీ ఒక డౌట్ వచ్చింది. అసలు దానికి ఎందుకు అంత డిమాండ్ ఉంటుంది అని ఎవరికీ అర్థం కావడం లేదు.దీన్ని దొంగ దారిన రవాణా చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎర్రచందనాన్ని వేటి వాడకంలో ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఎర్రచందనం ఎక్కువగా తూర్పు కనుమలలో ఈస్టన్ ఘాట్స్ లో మాత్రమే పెరిగే ఒక అరుదైన చెట్టు.

Video Advertisement

ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం కొండల్లో ఈ చెట్లు పెరుగుతాయి. ఎర్ర చందనానికి ఇంత డిమాండ్ ఉండడానికి రీజన్ ఏమిటంటే ఈ చెట్లు అరుదుగా ఉండడం వల్లే అయితే ఇంకొక రీజన్ ఏమిటంటే ఇది చాలా మెల్లిగా పెరుగుతుంది. సాధారణ చందనం చెట్టు పెరగడానికి 20 సంవత్సరాలు పడితే, ఇది మాత్రం పూర్తిగా పెరగడానికి 50 సంవత్సరాల పైనే పడుతుంది. అయితే ఈ ఎర్రచందనం చెట్టు పెరిగేవి మన ఆంధ్రప్రదేశ్లో అయినప్పటికీ దీన్ని డిమాండ్ మాత్రం వేరే దేశాల్లో ఎక్కువగా ఉంటుంది.

 

చైనా,జపాన్, మయన్మార్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చైనాలో అయితే ఫర్నిచర్ ను తయారు చేసేవారు. ఈ చెక్క తో తయారు చేసే ఫర్నిచర్ అరుదు గా కనిపించేది. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండేది. అలాగే చైనా దేశంలో దీనిని ఒక ఔషధంలాగా ఉపయోగించుకునేవారు. ఈ చెక్క మన శరీరంపై ఉపయోగించినపుడు ఇది ఒక చల్లని అనుభూతినిస్తుంది. అందుకే దీన్ని తలనొప్పికి, చర్మవ్యాధులకు, తేలు కుట్టిన గాయానికి,జ్వరానికి ఉపయోగించేవారు.

అలాగే ఖరీదైన సంగీత వాయిద్యాలను తయారు చేయడానికి ఈ చెక్కని ఉపయోగించేవారు. అంతేకాదు ట్రేడర్స్ చెప్పినదాని ప్రకారం దీన్ని షిప్ బిల్డింగ్ లో ఉపయోగిస్తారు. అలాగే న్యూక్లియర్ యాక్టర్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ని తగ్గించడానికి కూడా వీటిని వాడేవారు. అందుకే దీనికి అంత డిమాండ్. ఈ చెట్లు అరుదుగా మరియు విలువైనదిగా ఉంటాయి కాబట్టి ఇతర దేశాలు దిగుమతి చేసుకోవాలంటే అనేక రకాల పన్నులు కట్టి చాలా కష్టతరంగా వీటిని పొందుతారు. అందుకే చాలామంది వీటిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంచనా ప్రకారం గత మూడు సంవత్సరాల్లో 40 వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించారు.


End of Article

You may also like