Ads
విమానంలో ప్రయాణం చేయడం వలన డబ్బు ఖర్చు అయినా సరే వేగంగా మనం గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ముఖ్యమైన పనులు దూర ప్రాంతాల్లో ఉంటే కొన్ని గంటల్లోనే మనం అక్కడికి చేరుకోవచ్చు. సాధారణంగా మనం విమానం ఎక్కాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయి.
Video Advertisement
కొన్ని సామాన్లని విమానంలోకి అనుమతించరు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది చెక్ చేసినప్పుడు వాటిని తొలగిస్తారు. నిజానికి మనం ఏది పడితే అది ఎయిర్ పోర్ట్ లోకి తీసుకు వెళ్ళ కూడదు.
వాటిని అక్కడే విమాన సిబ్బంది చెక్ చేసి రూల్స్ ప్రకారం ఫార్మాలిటీస్ ని పూర్తి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని వాటిని తీసుకు వెళ్తే కచ్చితంగా భద్రతా సిబ్బంది అడ్డుకుంటారు. అయితే ధర్మామీటర్ ని కూడా మనం తీసుకెళ్లకూడదు. ధర్మామీటర్ ని తీసుకు వెళ్లడం కూడా ఒక రకంగా నేరమే.
అదేంటి ధర్మామీటర్ ని ఎందుకు తీసికెళ్ళకూడదు..? దీని వల్ల నష్టం ఏమైనా కలుగుతుందా..? ఇక మరి దీని గురించి చూస్తే.. విమానాన్ని అల్యూమినియంతో తయారు చేస్తారు. అయితే అల్యూమినియం మీద పాదరసం పడిందంటే కెమికల్ రియాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే విమానంలోకి ధర్మామీటర్ ని తీసుకు వెళ్ళ కూడదు.
క్లినికల్ ధర్మామీటర్ ని మనం సెక్యూరిటీ కి చూపించి వారి అనుమతితో తీసుకు వెళ్ళవచ్చు. దానిని మనం హ్యాండ్ లగేజీ లో పెట్టుకుని విమానంలోకి తీసుకు వెళ్ళవచ్చు. ఈ కారణం వల్లనే విమానంలోకి ధర్మామీటర్ ని అనుమతించరు. అలాగే విమానంలోకి కొన్ని రకాల సామాన్లను అనుమతించరు. వాటిని కూడా సెక్యూరిటీ వాళ్లు తొలగిస్తూ ఉంటారు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు విమానంలో కి సామాన్లను తీసుకు వెళ్ళ కూడదు తగిన రూల్స్ ఉంటాయి కాబట్టి వాటి ప్రకారమే నడుచుకోవాలి.
End of Article