విమానాల్లో THERMOMETER ని ఎందుకు అనుమతించరు.? వెనకున్న కారణం ఇదే.!

విమానాల్లో THERMOMETER ని ఎందుకు అనుమతించరు.? వెనకున్న కారణం ఇదే.!

by Mohana Priya

Ads

మనం ప్రయాణించడానికి రకరకాల మాధ్యమాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఏమైనా దూరంగా ఉన్న ప్రదేశానికి మనం తొందరగా వెళ్ళేది మాత్రం ఫ్లైట్ లోనే. ఫ్లైట్ ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మనకు ఏం కావాలన్నా సరే అందిస్తారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా వెంటనే స్పందించి సహాయం చేస్తారు. ఎలాంటి ఆహారం కావాలన్నా కూడా మనం సీట్ దగ్గరికి తెచ్చి ఇస్తారు. అలా ఫ్లైట్ లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి.Why do thermometers are not allowed in aeroplane

Video Advertisement

అయితే, మనకు తెలియని విషయాలు కూడా చాలానే ఉంటాయి. అందులో ఇప్పుడు మీరు చదవబోయే విషయం కూడా ఒకటి. సాధారణంగా ఫ్లైట్లోకి థర్మామీటర్ ని తీసుకెళ్లనివ్వరు. ఇది వినడానికి వింతగా ఉంది కదా? థర్మామీటర్ ని తీసుకెళ్లనివ్వకపోవడం ఏంటి అనిపిస్తోంది కదా. కానీ ఇది నిజమే ఫ్లైట్లోకి సాధారణ థర్మామీటర్ ని తీసుకెళ్లనివ్వరు. అందుకు ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే ఏరోప్లేన్ అనేది అల్యూమినియంతో తయారు చేయబడుతుంది.Why do thermometers are not allowed in aeroplane

ఏరోప్లేన్ నిర్మాణంలో చాలా వరకు అల్యూమినియం వాడుతారు. థర్మామీటర్ లో మెర్క్యురీ ఉంటుంది. ఒకవేళ పొరపాటున అల్యూమినియం మీద మెర్క్యురీ పడితే ఆ అల్యూమినియం తుప్పుపట్టిపోతుంది. ఒక్క చుక్క మెర్క్యురీ అల్యూమినియం మీద పడినా కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వెంటనే జరగకపోయినా కానీ కొన్ని రోజుల తర్వాత ఫ్లైట్ లో ఉన్న అల్యూమినియంపై మెర్క్యురీ ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేతనే ఫ్లైట్ లోకి థర్మామీటర్ లని తీసుకువెళ్ళడం ఇవ్వరు.


End of Article

You may also like