ఫ్యాక్టరీల పైకప్పుపై ఉండే వీటిని ఎప్పుడైనా గమనించారా.? అవి ఎందుకు పెడతారో తెలుసా..?

ఫ్యాక్టరీల పైకప్పుపై ఉండే వీటిని ఎప్పుడైనా గమనించారా.? అవి ఎందుకు పెడతారో తెలుసా..?

by Megha Varna

Ads

ఎప్పుడైనా మనం గమనించినట్లైతే ఫ్యాక్టరీల పైకప్పుకి తిరుగుతూ ఉండే పరికరాలను అమర్చి ఉంచుతారు. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగింద..? ఈ రొటేటింగ్ ఎక్యుప్మెంట్ ని ఫ్యాక్టరీ పై కప్పు కి ఎందుకు పెడతారు అని..? అయితే ఈ రోజు అది ఎలా పని చేస్తుంది..?, దాని వల్ల ఫ్యాక్టరీకి ఎలాంటి లాభం వస్తుంది అనేది చూద్దాం. ఇలా పైకప్పు కి అమర్చిన వాటిని రూఫ్ ఎక్స్ ట్రాక్టర్స్ అని అంటారు.

Video Advertisement

వీటి వలన ఫ్యాకటరీలకి ఎంతో బెనిఫిట్ కలుగుతుంది. మామూలుగా వేసవి కాలంలో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వేడి వలన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ ఇలాంటి ఫ్యాక్టరీలలో వేడి మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉద్యోగులు పని చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే వాళ్ళకి రిలీఫ్ కలగడానికి పోర్టబుల్ ఫ్యాన్స్ ని పెడతారు.

పోర్టబుల్ ఫాన్స్ చిన్న ప్రదేశాలని చల్లగా ఉంచుతాయి. దీంతో వేడి తొలగిపోయి కాస్త ప్రశాంతంగా, రిలీఫ్ గా ఉంటుంది. పైగా వీటిని సులువుగా అమర్చచ్చు. అలానే వీటి ధర కూడా తక్కువే. మంచి వెంటిలేషన్ ని ఇచ్చి చల్లటి గాలిని ఉంచుతాయి ఇవి.

వేడి గాలి బయటకు వెళ్ళిపోయి చల్లటి గాలి లోపలికి వస్తుంది. దీంతో లోపల కూడా చల్లగా ఉంటుంది. 1400 క్యూబిక్ మీటర్ బిల్డింగ్స్ వరకు కూడా ఇది ఎంతో చక్కగా పని చేస్తుంది. అందుకనే ఫ్యాక్టరీలకి వీటిని ఉపయోగిస్తారు.


End of Article

You may also like