కరోనా సమయంలో పనులన్నీ ఆగిపోవడంతో ఇంట్లో అందరూ ఏదో ఒక విధమైన హాబీని అలవాటు చేసుకుంటున్నారు. కొంత మంది పుస్తకాలు చదువుతున్నారు. కొంత మంది సినిమాలు లేదా టీవీ సిరీస్ చూస్తున్నారు. కొంత మంది ఏమో ఎప్పటినుండో చేద్దాము అనుకున్న పనులన్నీ చేస్తున్నారు. ఇంకొంతమంది కొత్త కొత్త వంటకాలు తయారు చేస్తున్నారు.

Recipe of viral tsunami cake

లాక్ డౌన్ సమయంలో ఇలా బయటికి వచ్చిన వెరైటీ వంటకాలు చాలానే ఉన్నాయి. అందులో మొదటిది డల్గోనా కాఫీ. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల వంటలు ఈ లాక్ డౌన్ సమయంలో వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి సునామీ కేక్. పేరు చాలా వెరైటీగా ఉంది కదా.

Recipe of viral tsunami cake

“కేక్ పేరు ముందు ఆ కేక్ యొక్క ఫ్లేవర్ పేరు ఉంటుందిలే కానీ సునామీ పేరు ఉండడం ఏంటి?” అని అనుకుంటున్నారు కదా. ఈ కేక్ స్పెషాలిటీనే అది. సునామీ కేక్ ప్రత్యేక దాని పైన ఉండే  ఐసింగ్. మామూలుగా అయితే కేక్ మీద ఏదైనా క్రీమ్ తో ఐసింగ్ చేస్తారు. కానీ సునామీ కేక్ మీద ఉండే ఐసింగ్ మాత్రం లిక్విడ్ రూపంలో ఉంటుంది.

Recipe of viral tsunami cake

కేక్ కంటే ఎత్తుగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ ని కేక్ చుట్టూ ర్యాప్ చేసి కేక్ మీద ఐసింగ్ లిక్విడ్ ని పోస్తారు. ఆ తర్వాత కేక్ చుట్టూ ఉన్న ర్యాప్ ని లాగగానే కేక్ మీద ఉన్న ఐసింగ్ కిందికి పడుతుంది. కార్న్ స్టార్చ్ ని పాలలో కలపడం ద్వారా ఇలా ఐసింగ్ మిశ్రమం లిక్విడ్ లాగా పలుచగా వస్తుంది. సునామీ కేక్ రెసిపీ బాగుంది కదా? మీరు కూడా ట్రై చేయండి.