మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ‘బాస్ పార్టీ’ సాంగ్ కూడా దూసుకెళ్తోంది.

Video Advertisement

 

అయితే దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు వాల్తేరు వీరయ్య గురించి ఇటీవల రివ్యూ ఇచ్చారు. ” వాల్తేరు వీరయ్య ట్రైలర్ మాస్ ధమాకా లా ఉంది. ఇది చిరంజీవి కం బ్యాక్ ఫిలిం అని ఇప్పుడు చెప్పొచ్చు. అద్భుతంగా ఉంది.” అని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆ చిత్రం గురించి, చిరంజీవి గురించి ఉమైర్ మరో ట్వీట్ చేసారు.

umair sandhu tweets about chiranjeevi..!!

” చిరంజీవి.. సినిమాల్లో నీ రొమాంటిక్ అవతారాలను మేము చూడలేకపోతున్నాం.. ఇప్పటి కైనా కొంచెం సీరియస్ గా ఉండే పాత్రలు చెయ్యి. వాల్తేరు వీరయ్య.. ఇంకో డిజాస్టర్..” అని ఉమైర్ ట్వీట్ చేసాడు. మరో ట్వీట్ లో ” చిరంజీవి అంకుల్.. ఇంకా యంగ్ గా ఉండటానికి ట్రై చెయ్యకండి.. మీకిప్పుడు 70 ఏళ్ళు..” అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్లను చూసిన మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

umair sandhu tweets about chiranjeevi..!!

అసలు ఇతడు ఎందుకు చిరంజీవి నే టార్గెట్ చేస్తున్నాడు అంటూ మెగా ఫాన్స్ అతడిని దుయ్యబడుతున్నారు. ‘ఇప్పటి వరకు నువ్వు చెప్పిన రివ్యూస్ లో ఒక్కటి కూడా కరెక్ట్ గా లేదు..’, ‘పబ్లిసిటీ కోసం గొప్ప నటుడుని ఇలా అనటం సరికాదు..’ ‘ గొప్ప వారిని గౌరవించటం నేర్చుకో..’ అంటూ ఫాన్స్ ఆ ట్వీట్స్ కి రిప్లై ఇస్తున్నారు. మరోవైపు ఉమైర్ సందు తన ట్వీట్స్ కి ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా.. సెలెబ్రెటీల గురించి అనధికారిక ట్వీట్స్ చెయ్యడం మానట్లేదు.