భారతీయ సినీ చరిత్రలో.. ఎప్పటికీ ‘నాటు నాటు’ది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా? వంటి అనుమానాలను ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు… సినిమాలోని ‘నాటు నాటు…’ ఆస్కార్ అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ‘నాటు నాటు’కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది.

Video Advertisement

కీరవాణి బాణీలు అందించిన ఈ పాట కి ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఈ పాటని ఎంతో హుషారెత్తించే విధంగా ఆలపించారు. రాంచరణ్ – ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

why everyone ignores ram charan..!!

సంగీత దర్శకుడు కీరవాణి .. ఆస్కార్ అవార్డుల వేదిక పై స్పీచ్ ఇస్తున్న టైంలో వెనుక ఎన్టీఆర్ ఫోటోను మాత్రమే చూపించారు. దీంతో చరణ్ అభిమానులు ఇబ్బంది పడ్డారు. ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ హీరోలు అని, అయితే ఇద్దరిలో ఒక్కరి ఫోటో మాత్రమే స్టేజి మీద ప్రదర్శించడం ఏమిటని మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

why everyone ignores ram charan..!!

అలాగే ఆస్కార్ గెలిచిందన్న వార్త బయటకు వచ్చిన వెంటనే చరణ్, ఎన్టీఆర్ ట్విట్టర్లో తమ ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్స్ చేసారు. అయితే వీటిలో ఎన్టీఆర్ తన ట్వీట్ లో చరణ్ పేరును ప్రస్తావించలేదు. కానీ చరణ్ మాత్రం ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశాడు. అలాగే గత కొద్ది రోజులుగా అమెరికా లో ఉన్న చరణ్ తాను ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా తారక్ గురించి గొప్పగా చెబుతున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం పలుమార్లు చరణ్ పేరును స్కిప్ చేయడం జరిగింది.

why everyone ignores ram charan..!!

అలాగే ఆస్కార్స్ కంటే ముందు ఓ పార్టీ జరిగింది. దానికి ఆస్కార్ అవార్డుల్లో నామినేషన్స్ అందుకున్న సెలబ్రిటీలు, ఆయా సినిమా యూనిట్ సభ్యులు అటెండ్ అయ్యారు. అయితే అక్కడ ప్రియాంకతో ఎన్టీఆర్ ఫోటోలు దిగారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు సైతం ఫోటోలు దిగారు. అయితే… ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ ఫోటో మాత్రం బయటకు రాలేదు. కేవలం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన ఒక్క ఫొటోలో మాత్రమే రాజమౌళితో ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించారు. దాంతో హీరోలు ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఈ స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.