టాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండగ ప్రేక్షకులకు నిజమైన పండగను తీసుకురాబోతున్నది. ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, తమిళ ఇళయదళపతి విజయ్, సూపర్ స్టార్ అజిత్ ఈ సంక్రాంతి బరిలో తలపడనున్నారు. అలాగే టాలీవుడ్ లో చిరు, బాలయ్య సంక్రాంతి పోటీలో తలపడ్డారు. ఈ సారి కూడా వారిద్దరి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.

Video Advertisement

సంక్రాంతి 2023 రిలీజ్ విషయానికి వస్తే.. అజిత్ నటించిన తణివు (తెలుగులో తెగింపు) జనవరి 11వ తేదీన, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12వ తేదీన, విజయ్ నటించిన వారిసు (తెలుగులో వారసుడు) జనవరి 12వ తేదీన, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. అయితే నలుగురు స్టార్ హీరోలు కావడంతో ఈ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై భారీ క్రేజ్ నెలకొంది.

tug of war between waltair veerayya, veerasimha reddy..

అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా మార్కెట్ చాలా పెద్దగానే ఉంటుంది. దానికి తగ్గట్టే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాక్. వాల్తేరు వీరయ్యను నైజాంలో 18 కోట్లకు, ఆంధ్రలో 40 కోట్లు, సీడెడ్‌లో 14.5కోట్లకు అమ్మినట్టు సమాచారం అందుతోంది. ఇక బాలయ్య వీర సింహారెడ్డి సినిమాను అయితే.. ఆంధ్రలో 35 కోట్లకు, నైజాంలో 15 కోట్లు, సీడెడ్‌లో 12.5 కోట్లకు అమ్మినట్టు తెలుస్తోంది. మరో వైపు ప్రమోషన్స్ విషయం లో కూడా వాల్తేరు వీరయ్య దూసుకుపోతుండగా..వీర సింహ రెడ్డి కాస్త వెనుక బడ్డాడు.

memes on veera simha reddy song..

ఇప్పటికే చిరు వాల్తేరు వీరయ్య సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం లో వింటేజ్ చిరు ని చూస్తారని సెన్సార్ సభ్యులు అభినందించినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ట్రేడ్ మార్క్ కామెడీ, రవి తేజ తో వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకుంటున్నారు. పాటలు కూడా ట్రేండింగ్ లో దూసుకుపోతోంది. ఇలా చూస్తే బాలయ్య సినిమా కాస్త వెనుకంజలో ఉంది. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుండగా.. రెండిట్లోనూ శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.