ఈ ఒక్క విషయంలో మిగిలిన ఇండస్ట్రీలు ముందుకి వెళ్తుంటే… మన “హీరోలు” మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నారా..?

ఈ ఒక్క విషయంలో మిగిలిన ఇండస్ట్రీలు ముందుకి వెళ్తుంటే… మన “హీరోలు” మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నారా..?

by Anudeep

Ads

ప్రస్తుతం అన్ని భాషల చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతూ భాషా బేధాలు లేకుండా అందర్నీ అలరిస్తున్నాయి. బాహుబలి తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతి ఎల్లలు దాటింది. ఆ ఒక్క చిత్రం తో ప్రపంచం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది టాలీవుడ్. అప్పటి నుంచి మంచి మంచి కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు మన హీరోలు.

Video Advertisement

అయితే ఎన్ని రికార్డులు కొల్ల గొట్టినా.. ఎంత అద్భుతమైన సినిమాలు తీసినా ఒక్క విషయం లో మాత్రం మన తెలుగు హీరోలు వెనకబడి ఉన్నారు. తెలుగు సినిమాలు అంటే మనకు ముందు గుర్తొచ్చేది ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి అలనాటి స్టార్ హీరోలు. వారి తర్వాత తరం లో స్టార్ హీరోలు అంటే చిరంజీవి, బాల కృష్ణ, వెంకటేష్, నాగార్జున. ప్రస్తుతం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రాంచరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా ఉన్నారు.

tollywood senior heros has to change the stroies.. here is why..??

అయితే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ల వయసు 60 సంవత్సరాలకి అటు ఇటు గా ఉన్నాయి. అయినా వీరంతా ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు తీస్తున్నారు. వారి సినిమాలు ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ లు కొడుతున్నాయి అంటే వారి క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. కానీ ఈ సీనియర్ హీరోలు వారి వయసుకు తగిన పాత్రలు ఎంచుకోవటం లేదన్నది ప్రేక్షకుల బాధ. టాలీవుడ్ మినహా ఇతర భాషల్లోని సీనియర్ హీరోలు వార్ వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు.

tollywood senior heros has to change the stroies.. here is why..??

ఉదాహరణకి ఇటీవల వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ లో ఆయన తన ఏజ్ కి తగ్గ పాత్రనే చేసారు. అలాగే రజనీకాంత్ కూడా.. మలయాళం లో చూసుకుంటే మోహన్ లాల్, మమ్ముట్టి, హిందీ లో సంజయ్ దత్ వంటి సీనియర్ హీరోలు తమ వయసుకు తగిన పాత్రలు వేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం సీనియర్ హీరోలు ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో డ్యూయెట్స్ వేయడానికే ట్రై చేస్తున్నారు అన్నది నిజం.

tollywood senior heros has to change the stroies.. here is why..??

అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు తండ్రి తరహా పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇప్పుడు కూడా వెంకటేష్, నాగార్జున కొన్ని సినిమాల్లో అలాంటి పాత్రలు వేస్తున్నారు కానీ మళ్ళీ రొమాన్స్, డ్యూయెట్స్ అంటూ వెనక్కి వెళ్తున్నారు. అంతే కాకుండా హీరోలు ఎంత ఫిట్ గా ఉన్నా కూడా వయసును దాచడం కష్టం. మళ్ళీ వీటి కోసం ఇంకాస్త కస్టపడి అలాంటి పాత్రల్లో నటిస్తున్నారు.

tollywood senior heros has to change the stroies.. here is why..??

తమ హీరో లు ఎప్పటికీ అందంగా, యవ్వనం గా కనిపించాలని వారి అభిమానులు కోరుకోవడం లో తప్పు లేదు కానీ, వారి వయసు దృష్ట్యా, హుందాగా ఉండే పాత్రలు ఎంచుకుంటే ఇంకా బావుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. వారికీ సరిపోని కథలతో, ఇప్పుడు చేయలేని యాక్షన్ సీక్వెన్స్ లతో ఎందుకు వారిని వారు కష్టపెట్టుకుంటారు అన్నది ప్రశ్న. వారితో పోలిస్తే ఎంతో చిన్న వారైన హీరోయిన్ల పక్కన వారిని చూడటం కూడా ఎబ్బెట్టుగా ఉందని ఈ మధ్య కాలం లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఈ విషయం పై మన స్టార్ హీరోలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.


End of Article

You may also like