రాజకీయాల్లో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ‘వకీల్ సాబ్’ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ బిజీ గా ఉంటున్నారు. ఇప్పటికే 3 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన పవన్ వాటిని ఎప్పటికి పూర్తి చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు సాహో ఫేమ్ సుజీత్ తో పవన్ సినిమా చేయనున్నట్లు డీవీవీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Video Advertisement

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ మరో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సినిమా పేరు భవదీయుడు భగత్ సింగ్ అని చెప్పారు. అయితే ఈ సినిమా గురించి అప్పటి నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు మళ్లీ సడన్ గా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం చెప్తాను అని ట్వీట్ చేశారు.

pavan fans fire about the theri remake rumours..

అయితే పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుండి రీమేక్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలో హరీష్ శంకర్, మైత్రి మూవీస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తేరి చిత్ర రీమేక్ ప్రకటించబోతున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పుడు హరీష్ తో తీసే సినిమా కూడా విజయ్ హీరోగా నటించిన తేరీ రీమేక్ అని అంటున్నారు. ఈ సినిమాని తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ కూడా చేశారు.

pavan fans fire about the theri remake rumours..

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం రీమేక్ ఏ నా.. లేకుంటే వేరేదా అన్నది తెలియట్లేదు. ఆల్రెడీ ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌’ కి టైటిల్ కి తగ్గట్టు ఒక మంచి కథ హరీష్ చెప్పే ఉంటారుగా.. మరి ఆ కథ నచ్చలేదా.. అని పవన్ ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. పవన్ నటించిన గత రెండు చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్ మూవీస్. పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే రీమేక్ చిత్రాలతో విసిగిపోయారు. మరోసారి పవన్ నుంచి వాళ్ళు రీమేక్ ఆశించడం లేదు.

pavan fans fire about the theri remake rumours..

కానీ భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని పక్కన పెట్టి.. తేరి రీమేక్ తెరకెక్కించేందుకు హరీష్ శంకర్ రెడీ అవుతున్నారనే రూమర్స్ రావడంతో పవన్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ మొదలు పెట్టారు. నిన్నటి నుంచి ‘ వి డోంట్ వాంట్ తేరి రీమేక్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో టాప్ లో ట్రెండింగ్ గా నిలిచింది. తేరి రీమేక్ ప్రకటిస్తే సూసైడ్ చేసుకుంటాం అని కూడా కొందరు అభిమానులు మైత్రి సంస్థకి, హరీష్ శంకర్ కి వార్నింగ్ ఇస్తున్నారు.

pavan fans fire about the theri remake rumours..

పవర్ స్టార్ ఇమేజ్ కి సరిపడే కథలే లేవా అంటూ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ తో ఒక్క సినిమా చెయ్యాలని ఎందరో డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నారు.. అవన్నీ కాదని మళ్ళీ రీమేక్ ఏంటన్నా.. నువ్వు పవర్ స్టార్ అన్న విషయం మర్చిపోయావా అన్నా? అంటూ ఫాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ నటించిన బద్రి వంటి చిత్రాలను చూసి ఆనందపడాల్సి వస్తుంది.

Pawan kalyan

సుజీత్ తో చేయబోయే చిత్రమే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ స్ట్రైట్ గా చేయబోతున్న యాక్షన్ మూవీ. ఈ సంతోషాన్ని ఆస్వాదించే లోపే ఈ రీమేక్ న్యూస్ ఫాన్స్ కి తలనొప్పిగా మారిందని అంటున్నారు. అయినా కొంతమంది మాత్రం అంత మంది హీరోలు ఉండగా వాళ్లు కూడా రీమేక్ సినిమాలు చేస్తూ ఉండగా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు అని అంటున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.