వివాహంలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు మూడు ముళ్ళే ఎందుకు వెయ్యాలి..?

వివాహంలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు మూడు ముళ్ళే ఎందుకు వెయ్యాలి..?

by Megha Varna

Ads

వివాహమనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. వివాహంతో ఒక తోడు మనకి ఉంటుంది. రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి. అలానే పెళ్లితో కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. భార్యకి భర్త, భర్తకి భార్య తోడుగా, నీడగా జీవితాంతం ఉండాలి. హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం లో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు సప్తపది, అరుంధతి ఇలా ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటి మాంగళ్య ధారణ.

Video Advertisement

ధారణ అంటే ధరించడం. మాంగళ్య అంటే మంచి అని అర్థం. వివాహంలో మూడుముళ్లు ఒక జంటని కలుపుతాయి. మూడుముళ్ల తర్వాత నుంచి కూడా ఇరువురు కలిసి జీవిస్తారు. ఒక కొత్త జీవితానికి శ్రీకారం చుడతారు. అయితే పెళ్లి లో ఎందుకు మూడు ముళ్ళు వెయ్యాలి..? రెండు ముళ్ళు లేదా నాలుగు ముళ్ళు వేయొచ్చు కదా..? ఇలాంటి సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? అయితే మరి ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి.

మూడు అనే అంకెకి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ.. సృష్టి, స్థితి, లయలు మూడు. ఇలా మూడుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ప్రతీ వ్యక్తికి స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు. స్థూల అంటే మాంసం, రక్తం, ఎముకలు. అలానే సూక్ష్మ అంటే శరీరానికి ఆధారభూతుడు అయిన జీవుడు నివసించేది.

ఇక కారణ అంటే సుఖదుఃఖాలను అనుభవిస్తాడా లేదా అని సాక్షి భూతంగా పరమాత్మ చూసే శరీరం. అందుకే ఈ మూడు శరీరాలకి మూడు ముళ్ళు అని మూడు ముళ్ళు వేయడం తరతరాల నుండి వస్తోంది. అందుకే వివాహంలో ఇప్పటికి కూడా మూడు ముళ్ళునే వేయిస్తారు.


End of Article

You may also like