‘గబ్బర్‌ సింగ్‌’తో వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్ లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రం రాబోతుంది. తొలుత ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ టైటిల్‌ను ప్రకటించారు. తాజాగా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా టైటిల్‌ మార్చి ఆదివారం పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ మొదలుపెట్టారు. కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆ పేరుని మార్చి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Video Advertisement

 

ఈ సినిమా పూజా కార్యక్రమాలు మైత్రి మూవీ సంస్థ ఆఫీసులో గ్రాండ్ గా జరిగాయి . అయితే ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు ,వివి వినాయక్ లాంటి డైరెక్టర్స్ కూడా హాజరయ్యారు. నిర్మాతలు ఎ.ఎం. రత్నం, దిల్‌ రాజు, శిరీష్‌, విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిభోట్ల సాహు గారపాటి, రామ్‌ ఆచంట, గోపి ఆచంట, కిలారు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

why trivikram is missing in pavan's new movie launch..??

 

పూజా కార్యక్రమాల అనంతరం దిల్‌ రాజు క్లాప్‌ కొట్టగా, ఎ.ఎం. రత్నం కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. అనంతరం ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఇంత మంది డైరెక్టర్స్, నిర్మాతలు హాజరైన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ స్నేహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరు కాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఏ ఫంక్షన్ అయినా ..ఏ మీటింగ్ అయినా త్రివిక్రమ్ మిస్ చేయడు. ఏదో ఇంపార్టెంట్ రీజన్ ఉంటే తప్పిస్తే ఆయన అటెండ్ కాకుండా ఉండరు.

why trivikram is missing in pavan's new movie launch..??

దీనిపై తెరవెనుక చాలా వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న విభేదాలు కారణంగా వాళ్ళు విడిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు పవన్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ ఎలా ఇన్వాల్వ్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యం లో చాలా రోజుల క్రితమే హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ ప్లానింగ్ త్రివిక్రమ్ చేతుల్లో ఉండడంతో.. పవన్ కళ్యాణ్ ఆ చిత్రాన్ని పక్కన పెట్టి మరీ భీమ్లా నాయక్ పూర్తి చేశారు.

why trivikram is missing in pavan's new movie launch..??

‘భవదీయుడు..’ ఆలస్యానికి పరోక్షంగా త్రివిక్రమ్ కారణం అనే ప్రచారం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని ఓకె చేసినా, లేటెస్ట్ గా సుజీత్ చిత్రాన్ని అనౌన్స్ చేసినా అన్నింటి వెనుక త్రివిక్రమ్ హస్తం ఉందనే బలమైన ప్రచారం ఉంది. దీంతో త్రివిక్రమ్ వల్ల ‘భవదీయుడు..’ స్క్రిప్ట్ ఎఫెక్ట్ కావడం, ఆలస్యం కావడంతో హరీష్ కాస్త ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే త్రివిక్రమ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సింగ్ లాంచ్ లో మిస్ అయినట్లు టాక్.