Ads
క్రీస్తు శతాబ్దం 1324 నుండి 1351 వరకు డెక్కన్ ప్రాంతాన్ని పాలించిన ఢిల్లీ సుల్తానుల లో మహమ్మద్ బీన్ తుగ్లక్ ఒకరు. మహమ్మద్ బీన్ తుగ్లక్ గియాస్-ఉద్-దిన్ తుగ్లక్ యొక్క వారసుడు. పాలన సమయంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. సాహిత్య తాత్విక విద్య ను కలిగి ఉన్న ఏకైక ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్.అంత తెలివి ఉన్నప్పటికీ ఆయన పాలన విధానం వల్ల, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడం వల్ల అందరి చేత మూర్ఖుడిగా పిలువబడ్డారు. అలా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక తెలివైన మూర్ఖుడిగా పిలవబడడానికి కారణాలు ఇవే.
Video Advertisement
మహమ్మద్ బీన్ తుగ్లక్ తన భూభాగాన్ని విస్తరించాలి అనుకున్నారు. అందుకోసం ప్రత్యేక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంత పెద్ద సైన్యం నిర్వహించాలంటే ఎంతో డబ్బు కావాలి. కాబట్టి ప్రజలని మామూలుగా కట్టే పన్ను కన్నా కూడా ఎక్కువ పన్ను కట్టమని ఆదేశించారు. అధిక పన్నుల భారం భరించలేక రైతులు తమ వృత్తి నుండి వేరే వృత్తులకు మారారు. దీంతో ఆహార కొరత ఏర్పడింది.మహమ్మద్ బీన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ ని పరిచయం చేశారు. 14వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వెండి కొరత ఉండేది. దాంతో వెండి నాణాలు అంటే ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాటితో సమాన విలువలతోనే రాగి నాణాలను ప్రవేశపెట్టారు. తర్వాత రాగి నాణాలను ఉపసంహరించి ఖజానా లో ఉన్న వెండి బంగారు నాణాలతో తమ రాగి నాణాలను మార్చుకోమని ప్రజలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ రెండు పథకాల వల్ల వచ్చిన నష్టం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని అధిగమించడానికి గంగా యమున నది ఒడ్డు పై ఉన్న భూముల పై పన్నులు పెంచారు. అధిక పన్ను భారం తో రైతులందరూ తమ వృత్తిని వదిలి దొంగతనాలు దోపిడీలు చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆర్థిక నష్టం ఇంకా ఎక్కువ కావడంతో కఠిన చర్యలు తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన పాలనలో ఎన్నో కరువులు వచ్చినా ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన గలిగారు.తన వల్ల ప్రజలకు వచ్చిన నష్టం తెలుసుకునే టప్పటికి ఆలస్యమైంది. అయినా సరే మహమ్మద్ బిన్ తుగ్లక్ రైతులకు తమ వృత్తులని తిరిగి పునరుద్ధరించడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు ఎన్నో రుణాలు, ఉపాయాలు కూడా అందించారు. అయినా కూడా ప్రజలు ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నారు.
మహమ్మద్ బిన్ తుగ్లక్ అధిక పన్ను వేయడానికి కారణం తమ సైనిక దళానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడానికి. తమ రాజ్యాన్ని పెంచడానికి. ఇంకా రాజ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి. కానీ ఇదంతా సాధ్యపడలేదు పైగా ప్రజల దృష్టిలో ఆయన చెడ్డవారు గా మిగిలిపోయారు.మొత్తం భారత ఉపఖండాన్ని పాలించడానికి రాజధాని ని ఢిల్లీ నుండి దౌలతాబాద్ కి మార్చారు. దాంతో ప్రజలందరినీ కొత్త రాజధానికి బదిలీ అవ్వాలని ఆదేశించారు. ప్రజలతోపాటు, పండితులు కవులు సంగీతకారులు రాజకుటుంబాలు కూడా బదిలీ అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలా బదిలీ అవుతున్నప్పుడు పునరావాస సమయంలో చాలా మంది మరణించారు. తర్వాత మంగోల్ దండయాత్ర జరగబోతోందని గ్రహించి రక్షణ చర్యగా అందరిని తిరిగి ఢిల్లీ కే వెళ్ళిపొమ్మని చెప్పారు. ఇలా రాజధాని బదిలీ చేసే ప్రణాళిక పూర్తిగా విఫలమైంది.
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచనలు తెలివిగా ఉండేవి కాకపోతే ఆచరణలో పెట్టడం సరిగా లేకపోవడం వల్ల చాలావరకు ఫలించేవి కాదు. ఆయనకు తెలియకుండానే మంచి గురించి తీసుకున్న నిర్ణయాలు ఎన్నో రకాలుగా నష్టపరిచేవి. దాంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలివైన మూర్ఖుడు అని పిలువబడ్డారు.
End of Article