Ads
ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 18 న వచ్చింది. మహా శివరాత్రి చాలా పెద్ద పండుగ. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున దీన్ని జరుపుకుంటారు. అభిషేక ప్రియుడు అయినటువంటి పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి పూజించిన ఆయన కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు. ఈయనకు వివిధ రకాల పదార్థాలతో పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలాగే స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో కూడా పూజలు చేస్తుంటారు. అయితే శివుని ఆరాధనలో పసుపు, కుంకుమ, తులసి దళాలు ఉపయోగించరు. కేవలం చందనం, విభూతి మాత్రమే వాడతారు.
Video Advertisement
అయితే శివుని ఆరాధనలో పసుపు, కుంకుమ, తులసి దళాలు ఎందుకు నిషేధించారో ఇప్పుడు తెలుసుకుందాం..
#1 పసుపు
శివుడిని పసుపుతో పూజించకపోవడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే…గ్రంధాల ప్రకారం.. శివలింగం పురుష మూలకానికి చిహ్నం. అయితే పసుపు అనేది స్త్రీలకు సంబంధించినది కనుక పరమేశ్వరుడి పూజలో పసుపును కూడా ఉపయోగించరు.
#2 కుంకుమ
భారతీయ సంస్కృతిలో కుంకుమను వివాహిత స్త్రీలకు ఆభరణాలుగా పరిగణిస్తారు. వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం కుంకుమను వాడతారు. అలాగే దానిని దేవుడికి కూడా సమర్పిస్తారు. కానీ శివుడిని ఏకాంతంగా పరిగణిస్తారు అలాగే పరమేశ్వరుడు సంహారం చేసే ఒక అవతారం అందుకే ఆయనకు కుంకుమతో పూజ చేయరు.
#3 తులసి దళాలు
తులసి దళాలకు చాలా పవిత్రత ఉంది. అలాగే ప్రతి పూజ లోను వీటిని ఉపయోగిస్తారు. అయితే శివుని పూజలో వీటిని ఉపయోగించకూదదు. ఎందుకంటే తులసి గత జన్మలో రాక్షస వంశం లో పుట్టింది. ఆమె పేరు వృందా.. ఆమె మహా విష్ణువుకు పరమ భక్తురాలు. ఆమె భర్త రాక్షస రాజు జలంధరుడు. అతడిని శివుడు ఒక యుద్ధం లో వధించాడు దీంతో శివుని పూజలో తులసి దళాన్ని ఉపయోగించకూడదని ఆమె శపించింది.
అలాగే శివలింగానికి శంఖం తో నీటిని సమర్పించకూడదు. శివ పురాణం ప్రకారం శంఖచూడ్ అనే రాక్షసుడ్ని శివుడే వధించాడు. అందుకే శంఖం తో శివుడికి నీటిని సమర్పించారు. ఇలా వివిధ కారణాల వల్ల ఇవన్నీ శివుని ఆరాధనకు నిషిద్ధం అయ్యాయి.
End of Article